Pushpa Makeover Video: అల్లు అర్జున్.. పుష్పరాజ్ గా మారిన ట్రాన్స్‌ఫార్మ్‌ వీడియోను చూశారా?

Pushpa Makeover Video: 'పుష్ప ది రైజ్' సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర ఎంతోమందిని అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ చాలా కష్టపడ్డారట. ప్రతిరోజు రెండు గంటల పాటు మేకప్ కు సమయాన్ని వెచ్చించేవారట. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ పోస్ట్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 10:29 AM IST
    • పుష్ప మేకర్ ఓవర్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్
    • అల్లు అర్జున్ ట్రాన్స్‌ఫార్మ్‌ లుక్ వీడియో వైరల్
    • అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్
Pushpa Makeover Video: అల్లు అర్జున్.. పుష్పరాజ్ గా మారిన ట్రాన్స్‌ఫార్మ్‌ వీడియోను చూశారా?

Pushpa Makeover Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'పుష్ప ది రైజ్'. గతేడాది డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ పోషించిన పుష్ప రాజ్ పాత్రకు, అతడు చెప్పే డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

పుష్ప రాజ్ మేనరిజంతో పాటు డైలాగులను, స్టెప్పులను అనుకురిస్తూ.. సోషల్ మీడియాలో అనేక వీడియోల ట్రెండ్ అయ్యాయి. వారి కోసం పుష్ప మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ పుష్ప లాగా ఎలా మారాడనే ట్రాన్స్ ఫార్మేషన్ ను చూపించారు.

అల్లు అర్జున్.. తన కెరీర్ లో తొలిసారి పుష్ప రాజ్ లాంటి రఫ్ లుక్ లో కనిపించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్మగ్లర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ తెరపై కనువిందు చేశారు. ముఖ్యంగా ఓ స్మగ్లర్ ఎలా ఉంటాడు? అతడి హావభావాలేమిటి? అని విషయంపై బన్నీ ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేశారు. ఆయనతో పాటు మేకప్ డిపార్ట్ మెంట్ కూడా అల్లు అర్జున్ ను రఫ్ లుక్ లో చూపించడంలో విజయం సాధించింది. 

అయితే ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్ర కోసం ప్రతి రోజు దాదాపుగా రెండు గంటలకు మేకప్ కోసం కేటాయించాల్సి వచ్చిందని ఇటీవలే ఓ కార్యక్రమంలో బన్నీ చెప్పుకొచ్చారు. తెల్లవారుజామున 5 గంటలకల్లా సెట్స్ కు వెళ్లి 7 గంటల వరకు మేకప్ కు టైమ్ పట్టేదట. షూటింగ్ పూర్తయ్యాక మేకప్ తీసేందుకు 20 నుంచి 40 నిమిషాల టైమ్ పట్టేది అని అల్లు అర్జున్ వెల్లడించారు. ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ.350 కోట్ల పైచీలుకు కలెక్షన్లు సాధించింది. 

Also Read: Meenakshi Chaudhary Photos: ఖిలాడి సినిమాలో రవితేజకు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Also Read: Khiladi Movie Liplock: హీరోలతో లిప్ లాక్ చేసేందుకు నాకు నో ప్రాబ్లమ్: 'ఖిలాడి' హీరోయిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News