Tragic Incident: ప్రేమతో భార్య చికెన్ బిర్యానీ పెట్టగా.. తెల్లారేసరికి శవమైన భర్త
Wife Killed To Husband With Chicken Biryani: కామం ముసుగులో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ప్రేమగా భార్య చికెన్ బిర్యానీ పెట్టిందని ఇష్టంగా తిన్న భర్త అదే ఆఖరి రోజు అని పసిగట్టలేకపోయాడు. తెల్లారి భర్త శవంగా కనిపించాడు.
Chicken Biryani Murder: వివాహేతర సంబంధం అమాయక భర్తను పొట్టన పెట్టుకుంది. చెడ్డ దారి పట్టిన భార్యను మందలించిన పాపానికి భర్త బలయ్యాడు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని గుర్తించిన భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మత్తు మందు కలిపిన చికెన్ బిర్యానీ పెట్టి మత్తులోకి జారుకున్న భర్తను అతి కిరాతకంగా హత్యకు పాల్పడింది. ఆమె చేసిన హత్య పోలీసులకు కూడా రెండేళ్ల వరకు తెలియలేదు. చిన్న తప్పిదం చేయడంతో ఆమె బంఢారం అంతా బయటపడింది. అయితే తండ్రి హత్యకు అతడి పిల్లలు కూడా సహకరించడం విశేషం.
Also Read: Collector Attack: కొడంగల్‌లో ఏం జరుగుతోంది? ఎందుకు రైతుల్లో ఆగ్రహం.. పూర్తి వివరాలు ఇవే!
ఉమ్మడి అనంతపురం జిల్లా తుమకూరుకు చెందిన మోహన్ కుమార్ (52)కు భార్య కవిత, కుమారుడు కౌశిక్, కుమార్తె దీక్షిత ఉంది. పెళ్లయిన మూడు దశాబ్దాల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. విద్యుత్ శాఖ జేఈగా పనిచేసే అక్తర్ పాషాతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆరేళ్లుగా వారి మధ్య సంబంధం కొనసాగుతుండడంతో భర్త వారించాడు. దీంతో కవిత తన పిల్లలను తీసుకువెళ్లి తుమకూరులో నివసిస్తోంది. తన ప్రియుడు అక్తర్‌పాషాతో కలిసి సహజీవనం ప్రారంభించింది. అనంతరం అక్తర్ పాషా ఆర్థిక సహాయంతో ఆమె హోటల్ కూడా నిర్వహిస్తోంది.
అయితే తనను వదిలేసిన భార్య కవిత, పిల్లలు కావాలని మోహన్ కుమార్ కోరేవాడు. ఈ సమయంలో భార్య పెట్టిన హోటల్ వద్దకు వచ్చి నిత్యం గొడవ పడేవాడు. మోహన్ కుమార్ గొడవలు తీవ్రమవడంతో అక్తర్ పాషాతో కలిసి భార్య కవిత, కుమారుడు కౌశిక్ అతడిని చంపేయాలని నిర్ణయించారు. పథకం వేసిన వారు 11 జనవరి 2023న రాత్రి 9 గంటలకు మోహన్ కుమార్‌కు ఫోన్ చేసి కుమార్తె దీక్షితకు ఆరోగ్యం బాగాలేదని పిలిపించారు. ఇంటికి వచ్చిన మోహన్ కుమార్‌కు పథకం ప్రకారం మత్తు మందు కలిపిన చికెన్ బిర్యానీ భోజనంగా పెట్టారు.
బిర్యానీ తిన్న మోహన్ కుమార్ మత్తులోకి జారుకోవడంతో పథకం ప్రకారం రోకలి బండతో మోది హత్య చేశారు. ప్రియుడు అక్తర్ పాషా కిరాతకంగా కత్తితో గొంతు కోశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి కారులు వేసుకుని కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి వద్ద పడేసి వెళ్లిపోయారు. అయితే మృతుడి తల్లి నాగరత్నమ్మ తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని మృతదేహం లభించడంతో ఆ ఫొటోలు నాగరత్నమ్మకు చూపించగా తన కుమారుడే అని గుర్తు పట్టింది. ఆమె మృతుడి భార్య కవితపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దాదాపు రెండేళ్ల తర్వాత కవిత చేసిన దారుణం వెలుగులోకి రావడంతో ఆమెతో పాటు ప్రియుడు అక్తర్ పాషా, కౌశిక్, ఆమె హోటల్ పని మనిషిని అరెస్ట్ చేశారు. భార్య హత్య చేసిన విధానం వార్త సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వయసులో వివాహేతర సంబంధం ఏర్పాటు.. హత్య చేయడం వంటి వాటిపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి