భూతల స్వర్గమైన  జమ్మూ ( Jammu ) లో శ్రీవారు కొలువుదీరనున్నారు. టీటీడీ ( TTD ) నిర్మించ తలపెట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని సంస్థ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


హిందువుల పవిత్ర దేవాలయంగా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ( Venkateswara swamy temple ) ప్రసిద్ధి చెందింది. తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala tirupati devasthanam ) ఆధ్వర్యంలో ఈ ఆలయం ఉంది. సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు తొలిసారిగా టీటీడీ...భూతల స్వర్గమైన జమ్మూలో ఆలయాన్ని ( TTD to built temle in Jammu ) నిర్మించ తలపెట్టింది. ఈ ఆలయం కోసం జమ్మూలో ఎంపిక చేసిన ఓ  స్థలాన్ని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ( TTD chairman yv subbareddy ) పరిశీలించారు. త్వరలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికార్ల బృందాన్ని జమ్మూకు పంపి..సమగ్ర నివేదిక రూపొందిస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి.  జమ్మూలో ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. జమ్మూలో శ్రీవారి ఆలయానికి టీటీడీ పాలకమండలి ఇప్పటికే ఆమోదం తెలిపింది. స్థల పరిశీలనలో వైవీ సుబ్బారెడ్డితో పాటు జమ్మూ కలెక్టర్ సుష్మా చౌహాన్, అడిషనల్ డిప్యూటీ కమీషనర్ శ్యాం సింగ్, తదితరులుున్నారు. Also read: Corona virus: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు కరోనా