తిరుమల దేవస్థానం (Tirumala temple )  దర్శనం మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయా అంటే అవుననే అన్పిస్తోంది. మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుంటున్న భక్తులకు ఇప్పుడు బ్రేక్ పడే పరిస్థితి కన్పిస్తోంది. వారం రోజుల వ్యవధిలో 17 మంది దేవస్థానం సిబ్బందికి కరోనా ( corona positive) సోకడంతో...తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD) అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడానికి అధికార్లు నిర్ణయించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో దేశం మొత్తం 5 దశల లాక్ డౌన్ ( lockdown) ను  చవిచూసింది. మత సంబంధమైన అన్ని ప్రార్ధనాలయాలు మూతపడ్డాయి. ఇటీవలే ఆంక్షలతో ఆధ్యాత్మిక దర్శనాలకు అనుమతి లభించడంతో ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh) లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో ( Tirumala) దర్శనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 3 నెలల విరామం అనంతరం భక్తులు ఇష్టదైవమైన శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం రోజుకు 13 వేలవరకూ భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడీ దర్శనాలకు మళ్లీ బ్రేక్ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికి కారణం దేశవ్యాప్తంగా కరోనా పెరుగుతున్నట్టే ఏపీలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత వారం రోజుల వ్యవధిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ( Tirumala Tirupati Devasthanam) చెందిన 17 మంది సిబ్బందికి కరోనా వైరస్  సోకినట్టు నిర్ధారణ అయింది. సేవలందించే క్రమంలో భక్తులతో నిరంతరం కాంటాక్ట్ లో ఉన్న సిబ్బంది కావడంతో అందరిలో ఆందోళన పెరిగింది. ఇది శ్రీవారి దర్శనాలపై ప్రభావం చూపుతోంది. భక్తులకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించినట్టే...సిబ్బందికి కూడా పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని టీటీడీ (TTD) అధికార్లు నిర్ణయించారు. కాంటాక్ట్  క్రమాన్ని పరిశీలించిన అధికార్లు భక్తుల ద్వారా సిబ్బందికి కరోనా సంక్రమించలేదని  గుర్తించారు. దాంతో దాదాపు వందమంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సంకల్పించారు. ప్రస్తుతానికి పెద్దగా ప్రమాదమేమీ లేనప్పటికీ...దర్శనాలపై మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందనేది జిల్లా అధికార్లు భావన. అదే జరిగితే శ్రీవారి దర్శనాలకు మరోసారి బ్రేక్ పడవచ్చు. Also read: Corona virus: ఏపీ, తెలంగాణ సీఎం నివాసాలకు చేరిన కరోనా వైరస్


 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..