Tirumala News: జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన టీటీడీ.. తిరుమల పీఎస్‌లో కేసు.. ఎందుకో తెలుసా..?
Ttd filed case on sakshi magazine: టీటీడీ సిబ్బంది మాజీ సీఎం జగన్ కు చెందిన పత్రికలలో వచ్చిన అవాస్తవా కథనాలపై సీరియస్ అయ్యారు. దీనిపై తిరుమలలోని టూటౌట్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
Police case filed against Jagan sakshi paper in tirumala: ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. అదే విధంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు సైతం కన్నుల పండుగగా సాగుతున్నాయి. అయితే.. భక్తులకు ఎక్కడ కూడా.. ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం.. తిరుమలకు వెళ్లి స్వామివారి పట్టు వస్త్రాలను సమర్పించారు. అదే విధంగా ప్రత్యేకంగా మొక్కులు కూడా తీర్చుకున్నాయి. అయితే.. ఆ తర్వాత మంత్రులు, టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూడాలని సూచించారు. ఈ నేపథ్యలో ఆయన వీఐపీ కల్చర్ గురించి కూడా మాట్లాడారు.
టీటీడీ అధికారులు వీఐపీలకు కాకుండా.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించారు. అయితే.. సీఎం చంద్రబాబు మీటింగ్ తర్వాత.. మరుసటి రోజు జగన్ కు చెందిన సాక్షి పత్రికలో కొన్నిన కథనాలు ప్రచురితమయ్యయినట్లు తెలుస్తోంది. ఆ కథనాలలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీటీడీ అధికారులకు కొన్ని హుకుంలు జారీ చేశారని, తాను చెప్పినట్లే నడుచుకొవాలంటూ ఆదేశాలిచ్చినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.
అయితే.. ఇది టీటీడీ దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీనిపై టీటీడీ అధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది .టీటీడీ ప్రతిష్టను భంగం కలిగేలా.. అవాస్తవ కథనాలు ప్రచురించినందుకు.. జగన్ కు చెందిన సాక్షి పేపర్ యాజామాన్యంపై చర్యలు తీసుకొవాలని టీటీడీ అధికారులు తిరుమల టూటౌట్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నటువంటి ఎలాంటి వ్యాఖ్యలనైన ఊరుకునేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.