TTD former Chief Priest passes away: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ( TTD ) మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా ( Coronavirus ) మహమ్మారి బారిన పడి శ్రీనివాసమూర్తి తిరుపతిలోని స్విమ్స్‌లో చేరారు.  అప్పటి నుంచి చికిత్స పొందుతున్న శ్రీనివాసమూర్తి సోమవారం ఉదయం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. Also read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే శ్రీనివాసమూర్తి దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా 20ఏళ్ల పాటు సేవలు అందించారు. దీంతో తిరుమలలో విషాదం అలుముకుంది. 


ఇదిలా ఉంటే తిరుమలలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దాదాపు 160కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. వారిలో శ్రీవారికి కైంకర్యాలు చేసే అర్చకులు, జియంగార్లు, సెక్యూరిటీ సిబ్బంది, పలువురు ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనాలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించిన అనంతరం టీటీడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.   Also read: Andhra Pradesh: ఒక్కరోజులోనే 5 వేలకు పైగా కరోనా కేసులు