TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..నవంబర్ నెలకు శ్రీవారి టికెట్ల జారీ అప్పుడే..!
TTD: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను చెప్పింది. నవంబర్ నెలకు సంబంధించి టికెట్ల విషయంపై క్లారిటీ ఇచ్చింది.
TTD: నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈనెల 21న(బుధవారం) ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. నవంబర్ నెలలో స్వామి వారికి నిర్వహించనున్న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. ఈనెల 21న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
ఈమేరకు టీటీడీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. టికెట్లను బట్టి మొదట వచ్చిన వారికి తొలి ప్రాతిపదికన టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులో ఉంటుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ నెలకు సంబంధించిన పొర్లు దండాల టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఈనెల 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నారు.
మరోవైపు వచ్చే నెల ఒకటి నుంచి 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈక్రమంలోనే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రదక్షిణం టోకెన్లు ఇవ్వడం లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. దీనిని భక్తులు గమనించాలని..ఈమేరకు టికెట్లు తీసుకోవాలని సూచించారు.
Also read:Khammam: లిఫ్ట్ పేరుతో ఇంజెక్షన్ దాడి..ఖమ్మం జిల్లాలో దారుణం..!
Also read:Viveka Murder Case: వివేక కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లేనా..? సుప్రీం కోర్టు నోటీసులు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి