Viveka Murder Case: సుప్రీం కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈకేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం విచారించింది. సీబీఐ విచాణలో ఎలాంటి పురోగతి లేదని ఈసందర్భంగా కోర్టుకు సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.
కేసులో నిందితులుగా ఉన్న వారంతా బెయిల్‌పై బయటకు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ఏపీ ప్రభుత్వం సైతం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదన్నారు సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా. అనంతరం ధర్మాసనం స్పందించింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై సమాధానం చెప్పాలని సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 14కు వాయిదా వేశారు. సుప్రీం కోర్టు నోటీసులతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లు అయ్యింది. గతంలో సీఎం జగన్‌పై వివేకా కూతురు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసును నీరు గార్చేలా మాట్లాడారని హాట్ కామెంట్స్ చేశారు. ఈకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్తే..తిరిగి వచ్చి బీజేపీలో చేరుతారంటూ సీఎం జగన్ అన్నారని సునీతారెడ్డి బహిరంగంగానే వెల్లడించారు. దీనిపై అప్పట్లో పెను దుమారం రేగింది.
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను కొనసాగిస్తోంది. ఇటీవల కడప జిల్లాలో మకాం వేసిన అధికారులు..పలువురిని విచారించారు. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల నుంచి కీలక విషయాలను రాబట్టారు. ఐతే ఆ విషయాలు వెలుగులోకి రాలేదు. దీంతో వైఎస్ వివేకా కూతురు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల ముందు తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైయ్యారు.
ఈఘటన అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం చకచక జరిగిపోయాయి. జగన్ రాగానే సీబీఐ విచారణ ఉంటుందని అంతా భావించారు. ఐతే అందుకు వైసీపీ ప్రభుత్వం వెనుకడుగు వేసిందన్న విమర్శలు వచ్చాయి. ఐతే ఆమె కూతురు మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్టు నోటీసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సమాధానం ఎలా ఉండబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న అల్పపీడన ముప్పు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
Also read:Khammam: లిఫ్ట్ పేరుతో ఇంజెక్షన్ దాడి..ఖమ్మం జిల్లాలో దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి