Khammam: లిఫ్ట్‌ పేరుతో ఇంజెక్షన్‌ దాడి..ఖమ్మం జిల్లాలో దారుణం..!

Khammam: దేశంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతోంది. తప్పుడు దారిలో డబ్బులు సంపాదించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Written by - Alla Swamy | Last Updated : Sep 19, 2022, 03:28 PM IST
  • ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన
  • లిఫ్ట్‌ పేరుతో దాడి
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Khammam: లిఫ్ట్‌ పేరుతో ఇంజెక్షన్‌ దాడి..ఖమ్మం జిల్లాలో దారుణం..!

Khammam: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో దారుణం జరిగింది. లిఫ్ట్‌ పేరుతో ఆగంతకుడు దారుణానికి పాల్పడ్డాడు. చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్(40)కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురును కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అతడి భార్య ప్రస్తుతం వల్లభిలో కుమార్తె వద్ద ఉంటోంది. ఈనేపథ్యంలో ఆమెను తీసుకొచ్చేందుకు బైక్‌పై బయలుదేరాడు.

వల్లభి సమీపంలోకి రాగానే ఓ దుండగుడు..జమాల్‌ను లిఫ్ట్‌ అడిగాడు. దీంతో అతడు తన వాహనంలో ఎక్కించుకుని ముందుకు వెళ్లాడు. కొంత దూరం వెళ్లగానే ఆ ఆగంతకుడు..జమాల్‌పై ఇంజెక్షన్‌తో దాడి చేశాడు. వెంటనే అతడు తన వాహనాన్ని పక్కకు నిలిపివేశాడు. ఆ వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఈవిషయాన్ని తన భార్యకు ఫోన్‌లో ద్వారా తెలియజేశాడు. అనంతరం అక్కడే కుప్పకూలాడు. 

రోడ్డు పక్కన వ్యక్తి పడిఉండటంతో వాహనదారులు సమీప ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే జమాన్ మృతి చెందాడు. ఘటనాస్థలిలో ఇంజెక్షన్, సిరంజీ, బైక్‌ ఉన్నట్లు పోలీసులకు స్థానికులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ముదిగొండ ఆస్పత్రికి తరలించారు. ఘటన వెనుక ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Also read:AP ASSEMBLY LIVE UPDATES: శాసనమండలిలో ఫైటింగ్ సీన్.. నారా లోకేష్ పైకి దూసుకెళ్లిన దువ్వాడ.

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న అల్పపీడన ముప్పు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News