Amit shah: ఏపీలో అధికారం దిశగా టార్గెట్ 2024 , నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం
Amit shah: కేంద్రమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ స్తాయి సమావేశం జరిగింది. ఏపీలో అధికారం దిశగా అడుగులు వేయాలని పార్టీ అగ్ర నాయకత్వం సూచించింది. సమావేశం వివరాల్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.
Amit shah: కేంద్రమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ స్తాయి సమావేశం జరిగింది. ఏపీలో అధికారం దిశగా అడుగులు వేయాలని పార్టీ అగ్ర నాయకత్వం సూచించింది. సమావేశం వివరాల్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.
తెలంగాణలో క్రమంగా పుంజుకుంటున్న బీజేపీ..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించింది. ప్రతిపక్షం తెలుగుదేశం స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ..2024 ఎన్నికల్ని టార్గెట్‌గా పెట్టుకుంది. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం నిమిత్తం మూడ్రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా తిరుపతిలో బస చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) ఆయనకు స్వాగతం పలికారు. జోనల్ కౌన్సిల్ సమావేశం అనంతరం స్వర్ణభారతి ట్రస్టు 20వ వార్షికోత్సవం, ముప్పవరపు ట్రస్ట్ కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం తిరుపతిలో బీజేపీ జాతీయ స్థాయి సమావేశం అమిత్ షా ఆధ్వర్యాన జరిగింది. సమావేశం అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీ నాయకురాలు పురంధరేశ్వరిలు అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు పలు కీలక విషయాలపై చర్చ జరిగిందని చెప్పారు. ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడటం జరుగుతోందని..ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కేంద్రమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చ జరిగిందన్నారు. ఏపీ విభజన బిల్లు అంశాలు ప్రస్తావనకొచ్చాయన్నారు. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాల్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చిందన్నారు. మిగిలిన అంశాలపై కూడా చర్చించినట్టు తెలిపారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదన్నారు.
2024లో ఏపీలో అధికారం దిశగా అడుగులు వేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేసినట్టు సోము వీర్రాజు(Somu Veerraju) చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు చెప్పారు. తిరుపతి పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) శ్రీవారిని దర్శించుకున్నారు.
Also read: Vizag Steel plant Apprentice: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీగా అప్రెంటిస్ ఖాళీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook