Vizag Steel plant Apprentice: అప్రెంటిస్ కోసం నిరీక్షిస్తున్న విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ప్రతిష్ఠాత్మక వైజాగ్ స్టీల్‌లో భారీగా అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ఖాళీల భర్తీకై దరఖాస్తులు ఆహ్వానిస్తోంది సంస్థ.
ప్రైవేటీకరణ (Vizag Steel plant privatisation)వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ నుంచి గుడ్‌న్యూస్. అప్రెంటిస్ ఖాళీల భర్తీకై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 150 ఖాళీల్ని భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం ఖాళీల సంఖ్య 150 కాగా, ఇందులో డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు 50 అయితే..గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు 100 ఉన్నాయి.
డిప్లొమా అప్రెంటిస్‌లో మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,కంప్యూటర్ సైన్స్, సివిల్ విభాగాలున్నాయి. వీటికి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు 3 వేల 542 రూపాయలు చెల్లిస్తారు. ఇక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లో మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్ విభాగాలున్నాయి. వీటికి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు 4 వేల 984 చెల్లిస్తారు. 2019, 2020, 2021లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిప్లొమా లేదా ఇంజనీరింగ్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా(Apprentice Posts) అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ నవంబర్ 18 కాగా ఇతర వివరాల కోసం www.vizagsteel.com ను సంప్రదించాల్సి ఉంటుంది.
Also read: Ap Government: మరింత బలోపేతం కానున్న ఫోరెన్సిక్ శాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook