Nirmala Sitharaman Satires ON MLA Grandhi Srinivas: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌కు క్లాస్ పీకారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు నిధులు మంజురు చేసినా.. ఇప్పటివరకు తాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను నిలదీసి మీ సమస్యను పరిష్కరించుకోండి అంటూ స్థానికులకు సూచించారు కేంద్రమంత్రి. ఇంతకు ఏం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం మత్స్యపురిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఆమెతో పాటు ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ తాగునీటి సమస్య గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. 


మత్స్యపురితో పాటు మరో ఆరు గ్రామాలకు తాను ఎంపీగా ఉన్నప్పుడు రూ.కోటి 25 లక్షల నిధులు మంజూరు చేశానని.. ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదా.. అని అడిగారు. దీనిపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. 


'ఈ గ్రామాలకు ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా.. మీకు రావాల్సింది రాలేదంటున్నారు. మీ ఎమ్మెల్యే గారిని గట్టిగా అడగండి. నేను ఆంధ్రప్రదేశ్‌ ఎంపీగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేశాను. అప్పుడు పనులు మొదలు పెట్టి.. ఇవాళ్టి వరకు పూర్తి చేయలేదు. నేను ఏపీ నుంచి వెళ్లి పోయి కర్ణాటకలో ఎంపీ అయినా.. మన ఎమ్మెల్యే గారికి ఆ ఆరు గ్రామాలను పట్టించుకునే సమయం దొరకలేదు. ఎందుకు డబ్బులు ఇచ్చినా.. ఎందుకు నీళ్లు తీసుకురాలేదని మీ ఎమ్మెల్యే గారిని అడగండి. ఆ గ్రామాలకు తప్పకుండా మంచి నీటి సమస్యను పరిష్కరిద్దాం. ఈ ఏడాది చివరినాటికి నీళ్లు వచ్చేలా చూస్తాం..' అని నిర్మలా సీతారామన్ అన్నారు.


నిర్మలా సీతారామన్ ఇటీవల ఎక్కడికి వెళ్లినా.. అక్కడ అధికారులను నిలదీస్తున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ రేషన్ షాపు డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు లేదని అడిగారు. తాజాగా తాగునీటి సమస్య పరిష్కంచని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also Read: Gujarat Fire Haircut: నిప్పుతో హెయిర్ కటింగ్.. అయ్యో జుట్టు మొత్తం పోయింది.. యువకుడికి తీవ్ర గాయాలు  


Also Read: T20 World Cup: ఆశలన్నీ భారత్‌పైనే.. పాక్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook