Ap three capital issue: ఏపీ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తరలింపుపై కేంద్ర మంత్రి ఏమన్నారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల అంశం ( Ap three capital issue ) పార్లమెంట్‌ ( Parliament )లో ప్రస్తావనకొచ్చింది. హైకోర్టును కర్నూలు ( High court to Kurnool )కు తరలించే విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ( Bjp Mp Gvl Narasimha rao ) అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ( Union minister Ravi shankar prasad ) సమాధానమిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan )..2020 ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించినట్టు గుర్తు చేశారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. 


ఏపీ హైకోర్టు ( Ap High Court )తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించిన అనంతరమే..తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని..హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయన్నారు. తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావల్సి ఉందని చెప్పారు. న్యాయస్థానం తరలింపులో ఎటువంటి గడువూ లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ( Minister Ravi Shankar Prasad )స్పష్టం చేశారు. హైకోర్టును తరలిస్తున్నారా లేదా అని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించడంతో..కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని చెప్పారు. 


Also read: AP Panchayat Elections ఫిర్యాదుల కోసం E-Netram App ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook