unknown persons puts santa claus hat on tallapaka annamacharya statue in Tirupati: ఆధ్యాత్మిక నగరమైన తిరుమలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీ వారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. కానీ ఇటీవల తిరుమల అనేక వివాదస్పద  అంశాలతో తరచుగా వార్తలలో ఉంటుందని చెప్పుకొవచ్చు. ఇటీవల కూటమి సర్కారు కూడా తిరుమలకు పూర్వవైభవం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ మధ్యనే కొత్తగా పాలక మండలిని సైతం ఏర్పాటు చేశారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన, మాడవీధుల్లో రీల్స్, వీడియోలు తీస్తు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే కేసులను పెట్టేందుక సైతం వెనుకాడబోమని .. టీటీడీ కొత్త చైర్మన్ బీఎస్ నాయుడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో తిరుపతి నగరం నడి బొడ్డున షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 


తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ పెట్టినట్లు తెలుస్తొంది.. దీనిపై స్థానికులు తమ నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అక్కడికి హిందు సంఘాలు చేరుకున్నాయి. ప్రశాంతంగా ఉన్న నగరంలో కొంత మంది కులాల చిచ్చు రాజేసేందుకు చూస్తున్నారని అక్కడి వారు ఈ ఘటనను ఖండిస్తున్నారు. 


Read more: Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తేదీలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..


తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ పెట్టిన  ఘటన పెనుదుమారంగా మారింది. ప్రస్తుతం హిందు సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసనలు తెలియజేస్తున్నాయి.  రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter