Unseasonal rains:తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జగిత్యాల, కోరుట్ల, రాయికల్, మేడిపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక సిరిసిల్ల, వేములవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అకాల వర్షాలతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిముద్దైంది. ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో అకాల వర్షాలు తమను నష్టాలకు గురిచేస్తున్నాయని  ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా పోయింది. మామిడితోటల్లో కాయలన్నీ నేలరాయాయి. మరోవైపు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వం ఆదుకొని సాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిరిసిల్లలో కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. ముస్తాబాద్ మండలం మొర్రాయి పల్లెలో వర్షానికి ధాన్యం కొట్టుకుపోవడంతో ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడం లేదనీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకంలో తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బస్తాకు 42 నుంచి 43 కిలోల తూకం వేస్తున్నారని రైతులు ఆరోపించారు.


ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఇవాళ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కడప జిల్లా పొద్దుటూరులో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల దాటికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.   అనంతపురం జిల్లా గుత్తిలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది. మొత్తంగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని  రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


Also Read: Tollywood Top Hero: టాలీవుడ్‌ నెంబర్ 1 హీరో ఎవరు.. టాప్-10లో ఎవరి స్థానం ఎక్కడ... సర్వేలో తేలిందిదే..


Also Read: Telangana Inter board: ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ వచ్చేసింది..సెలవులు ఎన్ని రోజులంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook