Tollywood Top Hero: టాలీవుడ్‌ నెంబర్ 1 హీరో ఎవరు.. టాప్-10లో ఎవరి స్థానం ఎక్కడ... సర్వేలో తేలిందిదే..

Survey Reveals Junior NTR Most Popular Telugu Hero: టాలీవుడ్‌లో నెంబర్ 1 హీరో ఎవరనే ప్రశ్న ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మా హీరో నంబర్ 1 అంటే మా హీరో నంబర్ 1 అని ఆయా హీరోల ఫ్యాన్స్ వాదించుకుంటారు. తాజాగా ఓ సర్వే టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ హీరో ఎవరనేది బయటపెట్టింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 09:04 PM IST
  • టాలీవుడ్‌లో నెంబర్ 1 హీరో ఎవరు
  • తాాజా సర్వేలో ఏం తేలింది
  • టాప్ 10లో ఎవరెవరి స్థానం ఎక్కడ
Tollywood Top Hero: టాలీవుడ్‌ నెంబర్ 1 హీరో ఎవరు.. టాప్-10లో ఎవరి స్థానం ఎక్కడ... సర్వేలో తేలిందిదే..

Survey Reveals Junior NTR Most Popular Telugu Hero: ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్.1 స్టార్ హీరో ఎవరు... ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. అయితే ఈ ప్రశ్న విన్న వెంటనే మదిలో కొందరు పెద్ద హీరోల పేర్లు మెదులుతాయి. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ తదితరుల పేర్లు గుర్తుకొస్తాయి. మా హీరో నంబర్ వన్ అంటే మా హీరో నంబర్ వన్ అని ఈ హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫైట్ చేస్తూనే ఉంటారు. అయితే తాజా సర్వేలో వీళ్లలో నంబర్ 1 స్థానంలో ఎవరున్నారనేది తేలింది. ఆ హీరో మరెవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్.

ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం... 2022 సంవత్సరానికి తెలుగులో మోస్ట్ పాపులర్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి టాప్-9 స్థానాల్లో ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. అయతే ఈ సర్వే ఎప్పుడు, ఎలా నిర్వహించారనే విషయంలో క్లారిటీ లేదు. ప్రముఖ జాతీయ మీడియా కథనంతో ఈ సర్వే వెలుగులోకి వచ్చింది.

సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. 2016లో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'జనతా గ్యారేజ్' మూవీ బిగ్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ చివరి సినిమా 'ఆచార్య' డిజాస్టర్‌గా మిగలడం తారక్ ఫ్యాన్స్‌ను కొంత టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకూ అపజయం ఎరుగని కొరటాల శివ... ఆచార్య సినిమాతో తొలి ఫ్లాప్ అందుకున్నారు. ఎన్టీఆర్‌ సినిమాతో కొరటాల శివ మళ్లీ గాడినపడుతారని ఆయన ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. 

Also Read : Rajasthan Royals: రాజస్థాన్‌ రాయల్స్‌కు శుభవార్త..అందుబాటులోకి స్టార్ ప్లేయర్..!

Also Read: PBKS vs DC Playing 11: పంజాబ్‌, ఢిల్లీ మధ్య 'డు ఆర్ డై' ఫైట్‌.. ఓడిన జట్టు ఇంటికే! తుది జట్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News