Vasamsetti Subhash: మంత్రి వాసంశెట్టికి గ్రహాల గండం.. `సంపర`లో పాప పరిహార పూజలు
Vasamsetti Subhash Offers Pooja In Sampara Muktheshwara Temple: ఎన్నికల్లో గెలిచి మంత్రిగా గెలిచిన అనంతరం అంతా ఆనందంగా ఉండగా పరిస్థితులు సహకరించడం లేదు. సీఎం, స్పీకర్ నుండి క్లాస్ తీసుకోవడం.. రాజకీయంగా కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో ఆయన పూజలు చేసినట్లు తెలుస్తోంది.
Sampara Muktheshwaram Temple: ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచి అమాత్యయోగం లభించినా కూడా ఆ నాయకుడి పరిస్థితులు అనుకూలించడం లేదు. పరిస్థితులు పగబట్టినట్టు కనిపిస్తున్నాయి. బయట.. లోపల అన్నింటా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండడంతో సంబంధిత మంత్రి ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కొందరు పండితులను ఆశ్రయించగా గ్రహాలు అనుకూలించడం లేదని చెప్పారని సమాచారం. వారి సూచన మేరకు నివారణ చర్యల్లో భాగంగా ఆలయంలో పూజలు చేశారు. ఆయనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆయన వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Also Read: Polavaram: నేడు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శన.. ఎప్పటికి పూర్తవుతుందో చెబుతారా?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం ఎమ్మెల్యేగా వాసంశెట్టి సుభాష్ గెలిచారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా వాసంశెట్టి సుభాశ్ బాధ్యతలు చేపట్టారు. అయితే కొంతకాలంగా ఆయనకు సమయం కలిసి రావడం లేదు. ఈ నడిమధ్య ఆయన తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని వారాల కిందట మంత్రి సుభాష్‌ను సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. వ్యవహార శైలిని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి అని చూడకుండా 'పద్ధతి' మార్చుకోవాలని హితవు పలికారు.
Also Read: YSRCP Win: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2027లోనే.. అందరూ సిద్ధంగా ఉండాలి
ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా మంత్రి వాసంశెట్టి సుభాశ్‌కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. సమావేశాలకు ఆలస్యంగా రావడంపై సుభాశ్‌ను స్పీకర్ అక్షితలు వేశారు. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో సుభాష్ దిగాలుగా ఉన్నారు. ఈ సమయంలో పండితులను కలిస్తే 'గ్రహాలు అనుకూలంగా లేవు' అని చెప్పినట్లు సమాచారం. గ్రహాల అనుకూలత కోసం ప్రత్యేక పూజలు చేయించాలని పండితులు సూచించారు.
అందులో భాగంగా పవిత్ర సోమవారం పరమశివుని జన్మ నక్షత్రం కలిసి రావడంతో కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర ముక్తేశ్వరంలోని ఈక్షణ ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి సుభాశ్ అభిషేకం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గ్రహ బాధలు తొలగిపోవాలని కోరుతూ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకం చేయించారు. మంత్రి పూజలు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. మరి పూజల అనంతరం ఆయన గ్రహాల పరిస్థితి మెరుగవుతుందో లేదో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.