Polavaram: నేడు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శన.. ఎప్పటికి పూర్తవుతుందో చెబుతారా?

Chandrababu Focused On Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌కు వరంలాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 16, 2024, 12:12 AM IST
Polavaram: నేడు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శన.. ఎప్పటికి పూర్తవుతుందో చెబుతారా?

Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రధాన అంశంగా ఉన్న పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. ప్రాజెక్టు మాత్రం పూర్తికాకపోవడంతో మరోసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడు మరోసారి పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించడం ఇది రెండోసారి.

Aslo Read: Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు

త్వరలో నిర్మించనున్న పోలవరం ప్రాజెక్ట్ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ సిబ్బందికి అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్ నుంచి సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో ఆదివారం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.

Also Read: YSRCP Win: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు 2027లోనే.. అందరూ సిద్ధంగా ఉండాలి

సోమవారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు సీఎం చంద్రబాబు పోలవరం చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు స్పిల్ వే, కాఫర్ డ్యామ్‌తో పాటు సీఎం చంద్రబాబు అన్ని పనుల క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వర్క్ షెడ్యూల్‌ను సీఎం ప్రకటించనున్నారు.

కొత్త డయాఫ్రం వాల్‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రారంభ పనులు ఎప్పుడు చేపట్టాలనేది సీఎం చంద్రబాబు పరిశీలన అనంతరం నిర్ణయించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేసిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఈ పనులు ప్రారంభయ్యే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News