Andhra Pradesh CID: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో కీలక అరెస్ట్‌ చోటుచేసుకుంది. ఇప్పటికే సోషల్‌ మీడియా అరెస్ట్‌లు కొనసాగుతుండగా.. తాజాగా రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో కీలక అధికారిగా ఉన్న విజయ్‌ పాల్‌ అరెస్టయ్యారు. అతడి అరెస్ట్‌ ఏపీలో రాజకీయంగా సంచలనం రేపింది. సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్‌ను మంగళవారం విచారణ చేపట్టిన పోలీసులు సాయంత్రం పూట అరెస్ట్ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది చదవండి: Rajya Sabha Election: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం.. ఈసీ షెడ్యూల్‌ విడుదల


ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీగా పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ కేసులో అరెస్టయి కస్టోడియల్ విచారణ కేసులో తీవ్ర వేధింపులకు గురయ్యారు. నాడు సీఐడీ అదనపు ఎస్పీగా విజయ్ పాల్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి విజయ్ పాల్‌ను పోలీసులు  విచారణ చేపట్టి తుదికి అరెస్ట్‌ చేశారు. కస్టోడియల్‌ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్‌ కోరగా సుప్రీంకోర్టు అతడి పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలో విజయ్‌ పాల్ అరెస్ట్‌ జరిగింది.

ఇది చదవండి: New Bride: 'అందంగా లేదు.. లావుగా ఉంది' అని అవమానించడంతో ఆర్మీ జవాన్‌ భార్య ఆత్మహత్య


 


ఐదేళ్ల కిందట గుంటూరు ఎంపీగా వైఎస్సార్‌సీపీ తరఫున రఘురామకృష్ణరాజు గెలిచి తిరుగబాటు చేశారు. నాడు పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని రఘురామకృష్ణరాజు నివాసం నుంచి అరెస్ట్‌ చేసి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి తన హత్యయత్నానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రఘురామకృష్ణరాజు తీవ్ర గాయాలు కనిపించాయి. ఆయన నడవలేని పరిస్థితిలో కనిపించిన విషయం తెలిసిందే.


అయితే  ఈ ఏడాది మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సంవత్సరం జూలై 11వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాటి సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌, నిఘా విభాగం అధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్‌ విజయ్‌ పాల్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి తదితరులపై కేసు నోదు చేశారు. ఈ కేసులో తన అరెస్ట్‌ భయంతో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేయగా ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం అక్టోబర్‌ 1వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ పరిణామంతో విజయ్‌ పాల్‌ అరెస్ట్‌ చోటుచేసుకుంది. భవిష్యత్‌లో ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయని తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.