AP: ఇక పోలీసుల అదుపులో డాక్టర్ రమేష్ బాబు
Vijayawada Covid Centre Fire Accident : విజయవాడ స్వర్ణప్యాలేస్ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం సంఘటన ఇక ఓ కొలిక్కి రానుంది. కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు విచారణకు ఏపీ హైకోర్టు అనుమతివ్వడంతో..పోలీసులు రమేష్ ను అదుపులో తీసుకోనున్నారు.
Vijayawada Covid Centre Fire Accident : విజయవాడ స్వర్ణ ప్యాలేస్ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం సంఘటన ఇక ఓ కొలిక్కి రానుంది. కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు విచారణకు ఏపీ హైకోర్టు అనుమతివ్వడంతో..పోలీసులు రమేష్ ను అదుపులో తీసుకోనున్నారు.
విజయవాడ స్వర్ణ ప్యాలేస్ కోవిడ్ సెంటర్ ( Vijayawada Swarna palace covid centre ) లో జరిగిన అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు విచారణ ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. ఇప్పుడిక హైకోర్టు అనుమతివ్వడంతో పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని విచారించనున్నారు. డాక్టర్ రమేష్ బాబు ( Dr Ramesh babu ) కస్టడియల్ విచారణకు హైకోర్టు అనుమతిచ్చింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకూ మూడ్రోజులపాటు విజయవాడ పోలీసుల డాక్టర్ రమేశ్ బాబును అదుపులో తీసుకుని..న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు.
స్వర్ణ ప్యాలేస్ హోటల్ లీజుకు తీసుకుని కోవిడ్ సెంటర్ ( Covid Centre ) ను అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్లో మంటల చెలరేగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. 20మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై విజయవాడ గవర్నర్ పేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రమేశ్ ఆస్పత్రి ఎండీగా ఉన్న డాక్టర్ రమేశ్ బాబు హైకోర్టు ( High court ) ను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేసింది. హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాజాగా విచారణకు అనుమతివ్వాల్సిందిగా పోలీసులు పిటీషన్ దాఖలు చేయడంతో హైకోర్టు మూడ్రోజుల కస్టడియల్ విచారణకు అనుమతిచ్చింది. ఇన్నిరోజులు పోలీసుల విచారణ నుంచి తప్పించుకున్న డాక్టర్ రమేష్ బాబు ఇక పోలీసు విచారణను ఎదుర్కోనున్నారు. Also read: AP: ఇక పేదల ఇళ్ల పట్టాల పంపిణీకు గ్రీన్ సిగ్నల్..30 లక్షల ఇళ్ల పట్టాలు సిద్ధం