Budameru Floods Behind Story: బుడమేరు పుట్టిన ప్రాంతం నుంచి కొల్లేరులో కలిసే వరకు వంకర టింకరగానే ప్రవహిస్తుంది. అందుకే బుడమేరుకు చూపులేదంటారు పెద్దలు. దానికి తోడు దూకుడుగా ప్రవహిస్తూ గట్టుదాటి ఊర్లను ముంచేస్తుంటుంది. విజయవాడలో ప్రవహించే కృష్ణా నది కంటే బుడమేరుతోనే నగరానికి ఎప్పుడూ ప్రమాదం ఉంటుంది. అందుకే బుడమేరును సారో ఆఫ్ విజయవాడగా పిలుస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుడమేరు ఓ వాగు. ఇది. మైలవరం, ఏ కొండూరు, జి కొండూరు కొండప్రాంంతలో పుట్టే బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ వద్ద రెండుగా చీలుతుంది. ఒకటి ఇబ్రహీంపట్నం, అగిరిపల్లి మీదుగా కృష్ణా నదిలో కలిస్తే, రెండవది విజయవాడ మీదుగా కొల్లేరుకు చేరుతుంది. బుడమేరులో సాధారణంగా 10-11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటుంది. కానీ ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 45 వేల క్యూసెక్కుల నీరు దాటి ప్రవహించడం, అదే సమయంలో కృష్ణా నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వెనక్కి తన్ని ఎన్టీపీసీని ముంచేస్తుందనే భయం కలిగింది. దాంతో ఎన్టీపీసీని కాపాడాలనే ఒత్తిడితో బుడమేరు వరదను విజయవాడవైపుకు వదిలేశారు. 


అయితే బుడమేరు వరదను విజయవాడలో వదిలే ముందు ముంపు ప్రాంతాల్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దాంతో జనం నిద్రలో ఉండగానే బుడమేరు సింగ్ నగర్ సహా 12 కాలనీలను ముంచేసింది. రోడ్డుపై 10 అడుగుల నీరు, ఇళ్లలోకి 6-7 అడుగుల నీరు చేరుకుంది. దీంతో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలెవరూ బయటకు రాలేకపోయారు. సింగ్‌నగర్, జక్కంపూడి కోలని, రాజరాజేశ్వరి పేట, అరుణోదయ కాలనీ, నున్న ఇలాంటి ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. ముంపునకు గురైన ఈ ప్రాంతాలన్నీ బుడమేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నవే. వీటితో పాలు చిట్టినగర్, విజయ పాల ఫ్యాక్టరీ, రాయనపాడు, పైడూరుపాడు, కవులూరు, వైఎస్సార్ కాలనీ ముంపు బారినపడ్డాయి


[[{"fid":"363422","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]ప్రభుత్వ నిర్లక్ష్యం


ఆగస్టు 30, 31 తేదీల్లో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 20, 25 ఏళ్లలో ఎప్పుడూ ఇంత వర్షపాతం చూడలేదు. కేవలం 36 గంటల్లో 26 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ స్థాయి వర్షాన్ని విజయవాడ నగరం తట్టుకోలేకపోయింది. ఇటు ప్రభుత్వం, అటు అధికారులు పెద్దగా పట్టించుకోలేనట్లుంది. అందుకే విజయవాడ ముంపుకు గురైంది. 


ముంపుకు కారణాలు అనేకం


విజయవాడలో ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బుడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలే. ఇక్కడ కరకట్టను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. 2010 తర్వాత కొత్తగా ఏర్పడ్డ కాలనీలు బుడమేరు క్యాచ్‌మెంట్ ఏరియాలో ఉన్నాయి. అక్కడ ఇళ్లు కట్టిన వారిలో చాలా మందికి అక్కడ బుడమేరు ప్రవాహం ఉందని కూడా తెలియదు. ప్రభుత్వం కూడా ఈ విషయం గుర్తించలేకపోయింది. బుడమేరు ఆక్రమిత ప్రాంతాల్లో కాస్త రేట్లు తక్కువే పెట్టి ప్లాట్లు.. ఇంటి స్థలాలు అమ్మేశారు. మధ్యతరగతి ప్రజలు భారీగా కొనుకున్నారు. దీంతో ఇక్కడ మరో నగరమే ఏర్పడింది. మరి ఇలాంటి ప్రాంతాల్లో కట్టడాలకు అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న విన్పిస్తోంది. 


కొల్లేరు ఆక్రమణలు, పూడికలు


కొల్లేరును కబ్జా చేసి చేపలు, రొయ్యలు చెరువులు ఇష్టారాజ్యంగా తవ్వుకున్నారు. బుడమేరు వరద నీరు కొల్లేరులో వేగంగా వెళ్ళే పరిస్థితి లేదపోయింది. బుడమేరు చుట్టూ ఆక్రమణలు, కొల్లేరు ముఖద్వారంలో చేపల చెరువులు వెరసి విజయవాడను ముంచేశాయి. కొల్లేరు ఆక్రమణల్ని తొలగించడంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చాలా వరకూ కృతకృత్యులయ్యారు. కానీ తరువాత మళ్లీ ఆక్రమణలు రాజ్యమేలాయి. 


ప్రభుత్వం ఏం చేస్తోంది


వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే విమర్శలు పెద్దఎత్తున విన్పిస్తున్నాయి. బుడమేరుకు వరద ముప్పు పొంచి ఉందని జలవనరుల శాఖ అధికారులు ముందుగానే ప్రభుత్వానికి తెలిపినా.. ముఖ్యమంత్రి చంద్రబాబు తేలికగా తీసుకున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. బుడమేరు గురించి నాకు బాగా తెలుసు. అది బుడ్డ ఏరు మాత్రమే. దానివల్ల నష్టమేమీ ఉండదని వ్యాఖ్యానించినట్టుగా సమాచారం ఉంది. ఇందులో నిజానిజాలు అధికారులే చెప్పాలి. చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నా తీసుకోకపోయినా బుడమేరు వరదను మాత్రం ప్రభుత్వం తక్కువ అంచనా వేసింది. ఎన్టీపీసీని కాపాడటంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి ప్రజలపట్ల లేదనే విమర్శలు వస్తున్నాయి. 


Also read: AP Rain Fall: ఏపీలో భారీ వర్షాలు విజయవాడలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.