Vangalapudi Anitha: వరుస వర్షాలు, కృష్ణా నది వరదలతో విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. సామాన్య ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడం సవాలుగా మారింది. అటు అధికార బృందం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై 24 గంటలు పని చేస్తున్నారు ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం అధికారిక నివాసం వదిలి బస్సులో నివాసం ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు హోం మంత్రి అనిత కూడా  కలెక్టరేట్లోనే ఉండి ఆమె అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సాక్షాత్తు హోమ్ మంత్రి నివాసం కూడా వరదల్లో చిక్కుకుపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 దీంతో ఆమె పిల్లలు సైతం  జలదిగ్బంధంలో ఉండటంతో వెంటనే వారిని అక్కడి నుంచి తప్పించడానికి ట్రాక్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు.  మరిన్ని వివరాల్లోకి వెళితే హోం మంత్రి అనిత  నివసించే కాలనీ రామవరప్పాడు వంతెన దిగువన ఉంటుంది. ఈ ప్రాంతంలో వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా కాలనీలోకి నీళ్లు ప్రవేశించాయి దీంతో హోం మంత్రి అనిత ఉంటున్న నివాసం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది.  


ఇంట్లో ఆమె పిల్లలు ఉంటున్నారు విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి ట్రాక్టర్ ద్వారా హోంమంత్రి కుటుంబ సభ్యులను  సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు సింగ్ నగర్ లో వరద ఉధృతి కారణంగా నిర్వాసితులకు సహకరించాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. 


Also Read : Tirumala Donation: తిరుమల ఆలయానికి మరో భారీ కానుక.. ఏం ఇచ్చారో తెలుసా?


ఇదిలాఉంటే విజయవాడలోని బుడమేరు వాగు  పొంగటంతో నగరంలో పెద్ద ఎత్తున వరదలు చుట్టుముట్టాయి. ఇప్పటికే పలు కాలనీలు జలమయం అయ్యాయి ఇళ్లల్లోకి నీరు వెళ్లి ప్రజలంతా డాబాల మీదకు వెళ్లి ఉంటున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కు చెందిన సిబ్బంది పడవల ద్వారా నిర్వాసితులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. 


 మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్గ గుడి నిర్వాహకులను 50 వేల పులిహార పొట్లాలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.అలాగే నగరంలో ఉన్న ప్రైవేటు హోటల్స్ వ్యాపారులను కూడా పెద్ద ఎత్తున ఆహార పొట్లాలను తయారు చేయాలని సూచించారు తద్వారా నిర్వాసితులకు ఆహార వసతి కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు  తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. 


Also Read : AP Hidden Camera Scandal: ఆడపిల్లల బాత్ రూముల్లో రహాస్యాలు కెమెరాలు.. వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు  


 మరోవైపు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని వరద తగ్గకుండా నివాసాలకు తరలి వెళ్లొద్దని ఆదేశించారు.  మరోవైపు కేంద్ర సహాయక బృందాలు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.  ఇప్పటికే విజయవాడలో సహాయక చర్యలు అందించేందుకు పవర్ బోట్లను సైతం వినియోగిస్తున్నట్లు తెలిపారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.