ప్రభుత్వ సేవలు  మరింత సులభమైన పద్దతిలో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థను ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.  గాంధీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి జగన్  తూ.గో జిల్లాలో కాకినాడలోని కరప గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థను సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం గ్రామ సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ గడప గడప కు అభివృద్హి ఫలాలు అందించే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని..ఈ లక్ష సాధన కోసం ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందిలే చూడాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇక నుంచి అన్ని రకాల సేవల గ్రామ సచివాలయం నుంచే పొందవచ్చని జగన్ పేర్కొన్నారు. విప్లవాత్మకంగా తీసుకొచ్చిన ఈ వ్యవస్థను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


ఇప్పటికే గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 1.26 లక్షల పోస్టులను భర్తీ చేసిన ఏర్పాట సర్కార్ వారికి నియామక పత్రాలు కూడా అదించింది. ఈ క్రమంలో ఈ రోజు నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ గ్రామ సచివాలయంలోనే ప్రభుత్వ సేవలు పొందే వీలుకల్గింది.