Visakhapatnam IT Hub: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఐటీ హబ్‌గా (Ap IT Hub)విశాఖపట్నం కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రభుత్వ నూతన ఐటీ పాలసీతో కొత్త కంపెనీలు విశాఖపట్నంలో ఐటీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. విశాఖపట్నం త్వరలో ఏపీ మెగా ఐటీ హబ్‌గా మారనుంది. విశాఖపట్నంలో ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్శిటీ (IT Research University)ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతిక అవసరాలతో పాటు విద్యార్ధులకు అవసరమైన ఐటీ పరిజ్ఞానం, నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు విద్యార్ధులకు అందిస్తారు. ఈ యూనివర్శిటీలో రెగ్యులర్, పార్ట్ టైమ్ ఐటీ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్ని ప్రవేశపెట్టనున్నారు. 


వైఎస్సార్ (YSR)ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో(Visakhapatnam) ఐటీ అభివృద్ధికి విశేషమైన కృషి జరిగింది. విశాఖపట్నంలో టెక్ మహీంద్రా, విప్రో, మెరాకిల్ సాఫ్ట్‌వేర్ వంటి 14 కంపెనీలు వచ్చాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో విశాఖపట్నంకు అన్ని అవకాశాలు వస్తున్నాయి. విశాఖలో ఏర్పాటు చేయనున్న యూనివర్సిటీ ద్వారా ఐటీ కంపెనీలకు అవసరమైన మానవవనరులు అందుబాటులో రానున్నాయి. సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీను విద్యార్ధులకు అందించేందుకు వర్శిటీ ఉపయోగపడుతుంది. ఇంజనీరింగ్ అనంతరం వివిధ కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులు ప్రైవేట్ కోర్సులు చేయాల్సి వస్తుంది. వర్శిటీ ఏర్పాటు ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ వర్శిటీ ద్వారా దేశ, విదేశాల్లో మన విద్యార్ధులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.


Also read: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై ఇజ్రాయిల్‌లో ప్రారంభమైన దర్యాప్తు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook