AP New Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంకు ముహూర్తం దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న జగన్ మదిలో మరో వ్యూహం స్పష్టంగా ఉందని తెలుస్తోంది. ఆ వ్యూహం ప్రకారం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఇంకా వెనక్కి తగ్గలేదు. కేవలం సాంకేతిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని మరింత సమగ్రమైన బిల్లును ప్రవేశపెట్టాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన. ఇందులో భాగంగానే ఏపీ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది ప్రభుత్వం. త్వరలో సమగ్రమైన బిల్లును మరోసారి ప్రవేశపెడతామని స్పష్టమైన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కొత్త బిల్లును సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని..ఆ ప్రక్రియకు టైమ్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.  


ఉగాది తరువాత ఏపీ రాజధానిగా విశాఖపట్నంను(Visakhapatnam) ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. శ్రీరామనవమి పండుగ నాడు అధికారిక ప్రకటన వెలువడవచ్చనేది వైసీపీ వర్గాల్నించి వస్తున్న సమాచారం. అయోధ్యకు రాముడు వచ్చిన రోజున నూతన రాజధాని ప్రకటన చేయడం సమంజసమనేది వైసీపీ నేతల అభిప్రాయం. కేవలం సాంకేతిక అంశాల పరిష్కారం కోసమే బిల్లును ఉపసంహరించుకున్న వైఎస్ జగన్(Ap cm ys jagan)..మనసులో మాత్రం విశాఖ  రాజధానిగా వ్యూహం సిద్ధమౌతోందట. ఇటీవల ఏపీ మంత్రి ఒకరు ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. ఉగాది తరువాత స్పష్టమైన ప్రకటన ఉంటుందన్నారు. విశాఖ రాజధాని అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress party) ప్రభుత్వానికి ముందు నుంచీ ఉన్న ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ముందుకు వెళ్తోంది. సాంకేతిక అంశాల్ని పక్కనబెట్టి..మిగిలిన అంశాల్ని విశాఖ రాజధానిగా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలుస్తోంది. 


Also read: Omicron Variant: పొరుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు, అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook