Visakhapatnam: మహిళా వాలంటీర్‌పై సచివాలయ సిబ్బంది వేధింపులు.. చాటింగ్ చేయాలంటూ..
Pendurthi Woman Volunteer: విశాఖ జిల్లాలో సచివాలయ సిబ్బంది వేధింపులు వెలుగులోకి వచ్చాయి. చాటింగ్ చేయాలంటూ వేధిస్తున్నారని మహిళా వాలంటీర్ ఓ వీడియోను విడుదల చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
Pendurthi Woman Volunteer: విశాఖ జిల్లా పెందుర్తిలో వాలంటీర్‌లపై సచివాలయ సిబ్బంది వేధిస్తున్నారంటూ.. మహిళ వీడియో కలకలం సృష్టిస్తోంది. పెందుర్తిలోని 94వ వార్డ్ గౌతమ్ నగర్‌కు చెందిన సచివాలయ అడ్మిన్, సెక్రటరీ వేధింపులకు పాల్పడుతున్నారని మహిళ ఫిర్యాదు చేసింది. తనతో రోజు సెల్‌ఫొన్‌లో చాట్ చేయాలని.. బయటకు రావాలంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని దళిత మహిళ వాలంటీర్ వాపోయింది. బాధిత మహిళ ఆమె భర్త సిబ్బందిపై వీడియో రికార్డ్ చేశారు. తనకు న్యాయం చేయాలంటూ భార్యాభర్తలు వేడుకున్నారు.
"నేను వాలంటీర్‌గా పనిచేస్తున్నాను. నన్ను గతేడాదిగా అడ్మిన్ సెక్రటరీ రాము, మరో సెక్రటరీ కిరణ్ వేధిస్తున్నారు. కిరణ్‌తో చాట్ చేయాలని రాము చెబుతున్నాడు. లేకపోతే జీతం వేయమని బెదిరిస్తున్నాడు. ఇంటి స్థలం కోసం వెళితే.. మాకు రాకుండా చేశారు. జియో ట్యాగింగ్ చేయలేదు. చాట్ చేస్తేనే ఇంటి స్థలం ఇస్తామని బ్లాక్ చేశారు. స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతామని నా సెల్ తీసుకుని.. వాట్సాప్ వెబ్ లాగిన్ అయ్యారు. నా నంబరు నుంచి వాళ్లే మెసెజ్‌లు పెట్టుకున్నారు. ఈ చాటింగ్‌లు చూపిస్తాం. ఇళ్ల పట్టాలు రాకుండా చేస్తామన్నారు.." మహిళా వాలంటీర్ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు వీడియోను విడుదల చేసింది.
గతంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ దృష్టికి తీసుకువెళ్లినా.. ఆయన పట్టించుకోలేదని చెప్పారు. ఆయన స్పందించకపోవడంతో మరింతగా వేధిస్తున్నారని వాపోయంది. వారి టార్చర్ తట్టుకోలేక ఒక సారి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపింది. భర్త సాయంతో మీడియాకి సమాచారం అందించింది. సోషల్ మీడియాలో బాధిత మహిళ, ఆమె భర్త వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Ys jagan on Chandrababu Case: చంద్రబాబు అరెస్టు పరిణామాలపై జగన్ సమీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook