Ys jagan on Chandrababu Case: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ తరువాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లండన్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని సమీక్షించారు. పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఏసీబీ తీర్పును సవాలు చేస్తూ ఇవాళ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ రేపు విచారణకు రానుంది. మరోవైపు ఇవాళ చంద్రబాబు హౌస్ కస్టడీ పిటీషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. నిన్న రాత్రి లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని అడిగి తెలుసుకున్నారు. అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కూడా జగన్‌ను కలిసి మొత్తం కేసు వివరాలు వివరించారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఎలాంటి స్పందన వ్యక్తమౌతుందో ఆరా తీశారు. అదే సమయంలో పార్టీ నేతలకు ఎలా వ్యవహరించాలనే విషయంపై కీలక సూచనలు జారీ చేశారు.
రేపు ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తరువాత ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు జనంలో ఉంటూ..చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
మరోవైపు వచ్చేవారం నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ అవినీతిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందనే విషయంపై ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాల్ని వారం రోజులపాటు నిర్వహించేందుకు నిర్ణయించారు.
Also read: Chandrababu Case: బావ కడిగిన ముత్యంలా బయటికొస్తారు, అంతా కక్ష సాధింపే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook