Bhaskar Rao Have No Relation with Our Party, Says Janasena: విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత రాఘవరావు వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఒక మైనర్ బాలికకు అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ తన పెళ్లి చేసుకోవాలని అతను బలవంతం పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన ఫుల్లుగా మద్యం సేవించి కత్తి పట్టుకుని ఆ అమ్మాయి ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లి తనను ప్రేమించకపోతే కత్తితో నరికి చంపేస్తానని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా అవసరమైతే నీకోసం నా భార్యను కూడా వదులుకునేందుకు సిద్ధమవుతానంటూ అతను న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా చూస్తూ ఆ అమ్మాయి స్నేహితులు రాఘవరావును అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా వారిని కూడా రాఘవరావు బండబూతులు తిట్టినట్లుగా చెబుతున్నారు. మీ మనవరాలు వయసున్న అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించటం కరెక్ట్ కాదని వాళ్లంతా బతిమిలాడుతుంటే తాను జనసేన రాష్ట్ర నాయకుడిని అని తనకు పవన్ కళ్యాణ్ తెలుసు, నేను తలచుకుంటే ఏమైనా చేస్తాను అంటూ అతను బెదిరింపులకు దిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.[[{"fid":"257624","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ విషయం మీద సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఇదే విషయం మీద జనసేన పార్టీ స్పందించింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్న కోన తాతారావు ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. విశాఖపట్నం నగరంలో బాలికను వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న రాఘవరావు అనే వ్యక్తికి జనసేన పార్టీలో ఎలాంటి బాధ్యతలు కానీ క్రియాశీలక సభ్యత్వం కానీ లేవని ప్రకటించారు. అలాగే ఇటువంటి నేరం పూరిత చర్యల్లో ఉన్న వారు ఎవరైనా సరే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరుతున్నామని ఆయన ఖండన ప్రకటనలో కోరారు.


రాఘవరావు అనే వ్యక్తి జనసేన పార్టీ నాయకుడు అంటూ పార్టీ ముఖ్య నాయకులతో ఉన్న ఫోటోలు చూపిస్తూ సాగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని పార్టీ ముఖ్యులతో ఎంతో మంది ఫోటోలు తీయించుకుంటారు అంతమాత్రాన వారు పార్టీ బాధ్యతల్లో ఉన్నవారిగాను, నాయకులుగాను పరిగణించవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక అంతేకాక సదరు వ్యక్తి కొద్దిరోజుల ముందు వరకు వైసీపీ పార్టీలో ఉన్నారని కూడా గమనించాలని ఆయన ప్రకటనలో కోరారు.


Also Read: Who is Radhika Merchant: చిన్ననాటి స్నేహితురాలితో అంబానీ చిన్న కొడుకు పెళ్లి.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?  


Also Read: Covid-19: చైనా సహా ఆ ఐదు దేశాల నుంచి ఇండియా రావాలంటే నెగటివ్ ఆర్టీపీసీఆర్ కంపల్సరీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook