Covid-19 alert: చైనా సహా ఆ ఐదు దేశాల నుంచి ఇండియా రావాలంటే నెగటివ్ ఆర్టీపీసీఆర్ కంపల్సరీ!

Negative RT-PCR mandatory for flyers from China: చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో భారత్ ఆ దేశాల నుంచి వచ్చేవారికి నెగటివ్ ఆర్టీపీసీఆర్ కంపల్సరీ అని నిర్ణయం తీసుకున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 30, 2022, 08:07 AM IST
Covid-19 alert: చైనా సహా ఆ ఐదు దేశాల నుంచి ఇండియా రావాలంటే నెగటివ్ ఆర్టీపీసీఆర్ కంపల్సరీ!

Negative RT-PCR mandatory for flyers from China and these five Countries: ఎప్పుడో 2019లో చైనాలో పుట్టిన కరోనా అనేక దేశాలను వణికించింది, ఇంకా వణికిస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు కోవిడ్ కొత్త వేవ్ వచ్చే అవకాశాలు భారీగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు జనవరి 1 నుంచి ప్రభుత్వం ఆర్టీ-పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసింది.

ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. ఇక జనవరి 1 నుంచి చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులు కోవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అంతేకాక ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కే ముందు ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఆర్టీ- పీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చిన కోవిడ్ రిపోర్ట్ ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని మాండవ్య చెప్పారు.

ఇక అంతేకాక ప్రయాణం చేయాల్సిన 72 గంటల్లోపు కోవిడ్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని ఆయున చెప్పారు. ఇక ప్రస్తుతం భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ విమానాశ్రయంలో ర్యాండమ్ టెస్ట్ తప్పనిసరి చేశారు. అయితే చైనా సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కే ముందు ఈ నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ నివేదికను సమర్పించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రి చెప్పారు.

ఇక చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడంతో భారత ప్రభుత్వం ముందే అలర్ట్ అయింది, అనేక మార్గదర్శకాలు జారీ చేసి, కొన్ని మార్గదర్శకాలను కఠినతరం చేసింది. ఇక అంతేకాక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తోంది. వచ్చే 40 రోజులు భారతదేశానికి చాలా కీలకమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు, జనవరిలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని, కరోనా కొత్త వేవ్ తూర్పు ఆసియాను తాకి 30-35 రోజుల తర్వాత భారతదేశాన్ని తాకే ట్రెండ్ ఉందని ఒక అధికారి తెలిపారు.

అయితే ఈసారి కోవిడ్ కొత్త వేవ్ వచ్చినప్పటికీ, మరణాల రేటు అలాగే ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే 4వ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్న క్రమంలో హైదరాబాద్ లో చాలా మంది కరోనా వ్యాక్సిన్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ వైద్య శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో 12 కేంద్రాల్లో కొవాగ్జిన్, 27 కేంద్రాల్లో కొవిషీల్డ్ అందిస్తున్నామని ఇప్పటివరకు హైదరాబాద్ లో 6 లక్షల మంది బూస్టర్ డోస్ తీసుకున్నారని మిగతా వారు తీసుకోవాలని చెబుతున్నారు.  
Also Read: ఈడు ఎప్పుడు కాళీ చేస్తాడా ? కుర్చీ లాక్కునేద్దామా అని చూస్తున్నారు!

Also Read: Who is Radhika Merchant: చిన్ననాటి స్నేహితురాలితో అంబానీ చిన్న కొడుకు పెళ్లి.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News