Viveka Murder Case: పది రోజులు సమయం ఇవ్వండి..సీబీఐ మరో లేఖ రాసిన అవినాష్ రెడ్డి
Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకు మరోసారి లేఖ రాశారు. తల్లి అనారోగ్యం, సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ నేపధ్యంలో మరి కొద్దిరోజులు గడువు ఇవ్వాలని కోరారు.
Viveka Murder Case: కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద హై టెన్షన్ నెలకొంది. బెయిల్ పిటీషన్ విచారణకు ఇవాళ సుప్రీంకోర్టు నో చెప్పడంతో పరిణామాలు ఆసక్తిగా మారాయి. అదే సమయంలో పదిరోజులు సమయం ఇవ్వాలని అభ్యర్ధిస్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకు లేఖ రాశారు. ఈ లేఖపై సీబీఐ ఏం సమాధానం చెబుతుందో ఆసక్తి రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ చుట్టూ ఉచ్చు బిగుసుకుపోయింది. అనారోగ్యంతో ఉన్న తల్లి కోసం కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న అవినాష్ రెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిల్లా ఎస్పీకు దీనికి సంబంధించి సమాచారమిచ్చేశారు. మరోవైపు అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ఇవాళ విచారించేందుకు సుప్రంకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మెన్షనింగ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని సూచించడంతో ఆ ప్రకారం రేపు మరోసారి ముందస్తు బెయిల్ పిటీషన్ మూవ్ చేసేందుకు అవినాష్ రెడ్డి న్యాయవాదులు సిద్ధమయ్యారు. బహుశా రేపు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈ అంశంపై విచారణ చేయవచ్చు.
సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాల నేపధ్యంలో ఇవాళ మద్యాహ్నంలోగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. కేంద్ర బలగాల్ని కూడా రప్పిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐకు లేఖ రాశారు. తల్లి అనారోగ్యంతో ఉండటం, తండ్రి ఇదే కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కారణంగా ఈ నెల 27 వరకూ విచారణకు హాజరుకాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో రేపు పిటీషన్ విచారణకు రానుండటంతో పాటు జూన్ 2న మరో పిటీషన్ విచారణ ఉండటాన్ని లేఖలో ప్రస్తావించారు. అప్పటి వరకూ తనకు పదిరోజులు సమయం ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని..గుండె రెండు కవాటాలు పనిచేయడం లేదని వైద్యులు విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ను కూడా సీబీఐకు పంపించారు. లో బీపీతో ఉన్నందున మరో వారం రోజులు ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాలని వైద్యులు తెలిపారన్నారు. వాస్తవానికి ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు అంటే ఈ నెల 16, 19 తేదీల్లో వివిధ కారణాలు చెప్పి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఇవాళ మరోసారి హాజరుకాకపోవడంతో సీబీఐ సైతం సీరియస్‌గా ఉందని సమాచారం. మరిప్పుడు అవినాష్ రెడ్డి తాజాగా రాసిన లేఖపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also read: Ys Viveka Murder Case: అవినాష్ రెడ్డికి షాక్, ముందస్తు బెయిల్ విచారణకు సుప్రీంకోర్టు నో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook