విశాఖ: వైజాగ్ గ్యాస్ లీకేజ్ ఘటనలో ( Vizag gas leak ) తీవ్రంగా అనారోగ్యం బారిన పడిన బాధితులను చూసి తర్వాత ఇంకేం జరుగుతుందోననే ఆందోళన, భయం గ్రామస్తులను వెంటాడుతున్న నేపథ్యంలో బాధితులకు భరోసా కల్పించేందుకు మంత్రులు, అధికారులు ఇక్కడే ఉంటామని మంత్రి అవంతీ శ్రీనివాస్ అన్నారు. విశాఖలో విష వాయువు లీక్ అయిన ఘటనలో ప్రమాదం బారినపడిన బాధితులు, అక్కడి పరిసర గ్రామాల ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిగా ప్రభుత్వం తరపున మంత్రి అవంతి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా కింద అందించనున్నట్టు సీఎం వైఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు నేడు మంత్రుల బృందం సంబంధిత అధికారులతో కలిసి వెళ్లి బాధితులకు చెక్కులు అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Vizag gas leak tragedy : విశాఖలో విష వాయువు చిమ్మిన పరిశ్రమ ఎదుట మిన్నంటిన ఆందోళనలు


ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విష వాయువులతో కాలుష్యం కోరల్లో చిక్కుకున్న అక్కడి పరిసర ప్రాంతాల గ్రామాల్లో జీవీఎంసి ( GVMC ) సిబ్బంది రోడ్లు ,ఇళ్లను పరిశుభ్రం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలు ఇళ్లకు రావాల్సిందిగా అక్కడి గ్రామాల ప్రజలకు మంత్రి అవంతి విజ్ఞప్తి చేశారు. ఇ౦టికి చేరుకున్న వెంటనే ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి లోపల ఉన్న గాలి బయటకి పోయేలా ఫ్యాన్ వేసి ఉంచ౦డి. ఇళ్లు పరిశుభ్రం చేసుకునేందుకు వీలుగా జీవీఎంసీ సిబ్బంది గ్రామస్తులకు రసాయనాలు అందిస్తారు. ఈ రెండు రోజుల పాటు ఎవ్వరూ ఏసీలు వాడవద్దు. అలాగే ఇప్పటికే ఇళ్లలో కొనిపెట్టుకున్న కూరగాయలు, పండ్లు వంటివి ఆహారపదార్ధాలు తినకుండా బయటే పడేయండి అని మంత్రి సూచించారు. 


Also read : Vizag gas leak tragedy : మరో ఇద్దరు మృతి, రూ. 30 కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదల


నేడు గ్రామంలోకి వచ్చే వాళ్లు అందరికీ ప్రభుత్వమే భోజనాలు, మంచినీరు అందిస్తుంది. ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఎవ్వరూ ఈ రోజు ఇళ్లల్లో వంటలు చేయవద్దని మంత్రి తెలిపారు. బాధితులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు జరిగే సర్వేలో భాగంగా రేపటి నుంచి వాలంటీర్లే నేరుగా మీ ఇళ్ల వద్దకు వస్తారు. ఈ ఘటనలో మీకు జరిగిన నష్టం ఏంటనే వివరాలను వాలంటీర్లకు తెలియజేయండని మంత్రి అవంతి వెల్లడించారు.\


Also read : విశాఖ గ్యాస్ లీక్: ఈ జాగ్రత్తలు పాటించండి..!!


ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో, ఇక్కడి గ్రామాల్లో పరిస్థితి అంతా అదుపులోనే ఉందని.. రేపటి నుంచి యధావిధిగా మీ రోజూవారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని మంత్రి అవంతి తెలిపారు. ప్రభుత్వం అందించే పది వేల రూపాయల ఆర్థిక సహాయం డబ్బులు రేపటికల్లా మీ బ్యాంకు ఖాతాల్లో పడతాయని మంత్రి అవంతి స్పష్టంచేశారు.


Also read : ఏపీలో 24 గంటల్లో 38 కొత్త కేసులు..!!


గ్రామస్తులకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను చూసేందుకు గ్రామంలో శాశ్వత హెల్త్ క్యాంపు, అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి మీకు సేవలు అందిస్తారు. ఈ ఘటనలో అస్వస్థతకుగురై కేజీహెచ్ నుంచి డిస్చార్జి అయిన వాళ్ళకి ప్రతీ 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తా౦ అని చెబుతూ.. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి వివక్షత లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..