విశాఖ గ్యాస్ లీక్: ఈ జాగ్రత్తలు పాటించండి..!!

విశాఖలో గ్యాస్ లీక్ ప్రమాదం కారణంగా.. అక్కడ అంతా ఉద్రిక్త పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి గ్యాస్ లీకేజీ పూర్తిగా తగ్గిపోయినప్పటికీ .. గాలిలో ఉన్న విష వాయువులు .. స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐతే విష వాయువులకు ఎలాంటి  జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కీలకాంశాలు విడుదల చేసింది.

Last Updated : May 7, 2020, 03:22 PM IST

విశాఖపట్నంలోని వేపగుంట, ఆర్ ఆర్ వెంకటాపురం, వలిమేరక కృష్ణరాయపురం, మూషిడివాడ, పెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం, మర్రిపాలెం ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని జీవీఎంసీ సూచించింది. 

* ప్రస్తుతం గాలిలో విషవాయువులు ఇంకా ఉన్నందున సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి  
* గ్యాస్ కారణంగా శరీరంలో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నీరు అధికంగా సేవించాలి. 
* అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవద్దు.
* గ్యాస్ ప్రభావం తగ్గాలంటే అరటిపండ్లు, పాలు, బెల్లం తీసుకోవాలి. 
* కచ్చితంగా ముక్కు, నోటికి తడితో ఉన్న మాస్క్ ధరించాలి.
* ఇంటి దగ్గర ఉన్నా మాస్క్ తప్పనిసరి.
* కళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి.
* కళ్లల్లో దురద, మంటలు అనిపిస్తే చుక్కల మందు వేసుకోవాలి. 
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కడుపు నొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలి.
* కనీసం 2 రోజుల పాటు ఇళ్లు కదలకుండా ఉండడం మంచిది.

ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని జీవీఎంసీ విజ్ఞప్తి చేసింది. అసత్యవార్తలను నమ్మవద్దని కోరింది. ఇదే సమయంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దని కోరింది.  అత్యవసర పరిస్థితి ఉంటే 108కి కాల్ చేయాలని సూచించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News