/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో  గత 24 గంటల్లో 38 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఐతే అందులో 27 కేసులు ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారే కావడం విశేషం. వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలిస్తున్నందున ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న నమోదైన వాటిలో గుజరాత్ నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన 26 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్ ఫలితం వచ్చింది. మరోవైపు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి  తిరిగి వచ్చిన 8 మంది చిత్తూరు జిల్లా వాసులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2018కి చేరింది. ఇందులో ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో 975 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 998 మంది కరోనా వైరస్‌కు చికిత్స తీసుకుని డిశ్చార్జై  సురక్షితంగా ఇంటికి వెళ్లారు. మరోవైపు కరోనా మహమ్మారికి 45 మంది బలయ్యారు. 

కర్నూలు జిల్లాలో అత్యధికంగా  కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు 575 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో 292 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 267 మంది ఆస్పత్రి నుంచి  డిశ్చార్జయ్యారు. జిల్లావ్యాప్తంగా 16  మంది మృతి చెందారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
38 new coronavirus positive cases reported in andhra pradesh in last 24 hours, total number of cases raised to 2018
News Source: 
Home Title: 

ఏపీలో 24 గంటల్లో 38  కొత్త కేసులు..!!

ఏపీలో 24 గంటల్లో 38  కొత్త కేసులు..!!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఏపీలో 24 గంటల్లో 38 కొత్త కేసులు..!!
Publish Later: 
No
Publish At: 
Monday, May 11, 2020 - 13:23