కంటైన్మెంట్ జోన్ అంటే ఏమిటి, వాటిని ఎలా వర్గీకరిస్తారు?
లాక్‌డౌన్‌లు, ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నా వైరస్ ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావిత ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. లాక్‌డౌన్‌లు, ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నా వైరస్ ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావిత ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అనంతరం కరోనా తీవ్రను ఆధారంగా చేసుకుని వీటిని రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్‌లుగా విభజించారు. అయితే కంట్మైన్మెంట్ అంటే ఏమిటి. దాన్ని మూడే జోన్లుగా ఎలా విభజిస్తారో ఏపీ వైద్యశాఖ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..
కంటైన్మెంట్ జోన్
కోవిడ్-19 పాజిటివ్ కేసులను గుర్తించిన నిర్దిష్ట ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ అని పిలుస్తారు.
బఫర్ జోన్
కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను బఫర్ జోన్ అంటారు. ఇంకా చెప్పాలంటే కంటైన్మెంట్ జోన్ చుట్టూ ఉన్న ప్రాంతాలని చెప్పవచ్చు.
రెడ్ జోన్ (హాట్ స్పాట్)
అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉండి, వైరస్ ఇన్‌ఫెక్షన్ శాతం ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలను రెడ్ జోన్‌లుగా పేర్కొంటారు. వీటినే హాట్ స్పాట్ జోన్లు అని కూడా పిలుస్తారు. Pics: క్యాలెండర్ గాళ్ సొగసు చూడతరమా!
ఆరెంజ్ జోన్
కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్ అంటారు.
గ్రీన్ జోన్
కొద్ది కాలంగా కొత్తగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాని, అసలు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదవ్వని ప్రాంతాలను గ్రీన్ జోన్‌గా వ్యవహరిస్తారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!