Ap New District Names: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. జిల్లాల పునర్విభజనతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. వ్యక్తుల పేర్లతో ఎందుకు జిల్లాలు ఏర్పడ్డాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఇప్పటి వరకూ ఉన్న 13 జిల్లాల స్థానంలో మరో 13 జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. జిల్లాల విభజనతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదనంగా కొన్ని జిల్లాలు వ్యక్తుల పేర్లతో ఏర్పడ్డాయి. గతంలో కేవలం ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు మాత్రమే పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ అని పేర్లుండేవి. ఇప్పుడు కొత్తగా మరికొన్ని జిల్లాలు  జత చేరాయి. ఆ జిల్లాలేంటి, ఎందుకు వ్యక్తుల పేర్లు పెట్టారో తెలుసుసుందాం..


ఏపీలో వ్యక్తుల పేర్లతో ఏర్పడిన మొదటి జిల్లా ప్రకాశం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు సేవలకు గుర్తుగా 1972లో ఒంగోలు పేరు మార్చారు. ఆ తరువాత ఆంధ్రరాష్ట్ర అవతరణకు కారణమైన పొట్టి శ్రీరాములుకు గుర్తుగా 2008లో నెల్లూరు జిల్లాకు ఆ పేరు పెట్టారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుర్తుగా 2010లో కడప జిల్లాకు పేరు మార్చారు. 


ఇప్పుడు భౌగోళికంగా పెద్దది కావడంతో పరిపాలనా పరంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం..అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చింది. ఇందులో పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా ఏర్పాటు చేశారు. తూర్పు కనుమల్లో పుట్టి..బ్రిటీషును ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు. ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన నందమూరు తారక రామారావు పేరుతో విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు పేరు పెట్టారు. ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్యది కడప జిల్లా. అందుకే కడప నుంచి కొత్తగా రాయచోటి కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరు మార్చారు. అదే విధంగా పుట్టపర్తి సత్యసాయి బాబా సేవలకు గుర్తుగా కొత్తగా ఏర్పడిన జిల్లాకు శీ సత్యసాయి జిల్లాగా పేరు పెట్టారు. అంటే ఇప్పుడు వ్యక్తుల పేర్లతో మొత్తం 7 జిల్లాలున్నాయి. 


Also read: AP New Districts: రాయలసీమకు సముద్రం..కొత్త జిల్లాల పర్యవసానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook