Ugadi 2022 Panchamgam on Pawan Kalyan: శనివారం (ఏప్రిల్ 2) చైత్ర శుద్ధ పాడ్యమి. అంటే ఉగాది పర్వదినం. తెలుగు వారి నూతన సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు మొదటి పండుగ కనుక ఏడాది అంతా కూడా ఆనందంగా ఉండాలని, మంచి జరగాలని కోరుకుంటారు. రేపు శ్రీ ప్లవ నామ సంవత్సరానికి (2021) ముగింపు పలికి శుభకృత్​ నామ సంవత్సరానికి (2022) ఆహ్వానం పలకనున్నాం. ఉగాది వచ్చిందంటే తెలుగు ప్రజలంతా కొత్త పంచాంగంలో ఏముందో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి ఎలా ఉండబోతుందో జోతిష్య నిపుణులు పాలెపు రాజేశ్వర శర్మ చెప్పారు. మెగా స్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో సీఎం అవుతారా?, మెగా బ్రదర్ నాగబాబు పూర్తిగా రాజకీయాల్లోకి వస్తారా? అన్న విషయాలపై రాజేశ్వర శర్మ చెప్పిన విషయాలు మీ కోసమే... 


చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుల పొలిటికల్ కెరీర్‌లో చాలా హైప్ అనేది ఏమీ ఉండదని జోతిష్య నిపుణులు పాలెపు రాజేశ్వర శర్మ తెలిపారు. 'చిరంజీవి గారు హీరోగా సక్సెస్. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన రాజజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టినప్పుడు వద్దని కొందరు జాతకులు చెప్పారు. అయినా చిరు ఒకరి సలహాతో ముందుకు వెళ్లారు. ఆ తర్వాత అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కేంద్రమంత్రి అయ్యారు. మళ్లీ రీ ఎంట్రీ అంటే.. అంతగా ఏమీ ఉండదు' అని రాజేశ్వర శర్మ చెప్పారు. 


'పవన్ కళ్యాణ్ గారి ప్రభావం బాగా పెరుగుతుంది కానీ.. సీఎం అయ్యే చాన్స్ అయితే ఇప్పట్లో లేదు. వారి కుటుంబానికి కూడా లేదు. పవన్  గారి మంచి ప్రభావం అయితే ప్రజలపై ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీని సంపూర్ణంగా వదిలేసి.. బీజేపీలోకి మెర్జ్ అవుతారని నేను అనుకుంటున్నా. ఏదేమైనా పవన్ గారు రాజకీయంగా పుంజుకుంటారు' అని జోతిష్య నిపుణులు పాలెపు రాజేశ్వర శర్మ చెప్పుకొచ్చారు. ఉగాది తర్వాత పార్టీపై పవన్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నారని సమాచారం. 


Also Read: Gayatri Bharadwaj: టైగర్ నాగేశ్వరరావులో ఇద్దరు హీరోయిన్స్.. రవితేజ సరసన హాట్ మోడల్!!


Also Read: Rashmika Mandanna: ఊహించని షాక్.. రష్మికను సైడ్ చేసిన విజయ్?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook