YSR Congress Party: 'జమిలి ఎన్నికలు వస్తున్నాయి. ఒక దేశం ఒక ఎన్నిక జరుగుతుంది. 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి' అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు. 'మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి' అని పేర్కొన్నారు. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ విజయ సాయి సూచించారు. తాను తిరిగి ఉత్తరాంధ్రకు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు


విశాఖపట్టణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఎంపీ తనూజ రాణి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి ఉత్తరాంధ్ర రీజనల్‌ కో ఆర్డినేటర్‌ విజయ సాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం విజయ సాయి మాట్లాడుతూ... 'గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాధించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరినీ కలుపుకుపోవాలి' అని సూచించారు. కార్యకర్తలకు పార్టీ అధినేత వైఎస్ జగన్ అండగా ఉంటారని ప్రకటించారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారని చెప్పారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకులకు సూచించారు.

Also Read: Chandrababu: ప్రధాని మోదీకి చంద్రబాబు షాక్‌.. జమిలి వచ్చినా ఏపీలో ఎన్నికలు 2029లోనే


తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రకటించడం కలకలం రేపింది. 'నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని' అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఆరు నెలల్లో చంద్రబాబు రూ.72 వేల కోట్లు అప్పు తీసుకువచ్చి సంక్షేమానికి కేవలం రూ.200 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి దోచుకోవడమే కావాలి కానీ ప్రజలతో సంబంధం లేదని విమర్శించారు. 'కూటమికి ప్రజలతో సంబంధం లేదు. మీడియాను పట్టుకుని హడావుడి చేస్తోంది' అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈనెల 27వ తేదీన చేపట్టనున్న విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.