Chandrababu Naidu: సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన ఆత్మార్పణంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి దోహదం చేసిందని గుర్తుచేశారు. ఆయన ప్రాణ త్యాగంతోనే తెలుగు రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. త్వరలో పొట్టి శ్రీరాములుపేరుతో ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం ఏపీని సర్వనాశనం చేస్తే తాము అభివృద్ధి వైపు నడిపిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Chandrababu: ప్రధాని మోదీకి చంద్రబాబు షాక్.. జమిలి వచ్చినా ఏపీలో ఎన్నికలు 2029లోనే
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ‘శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం’ కార్యక్రమంలో పాల్గొని సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పలు కీలక అంశాలపై స్పందించారు. గత ఐదేళ్లు ఇంత స్వేచ్ఛ ఉండేదా? అని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు తలపెడితే గత వైఎస్ జగన్ ప్రభుత్వం వాటిని పక్కనపెట్టిందని ఆరోపించారు.
Also Read: YS Sharmila: మోడీ పిలక చంద్రబాబు చేతుల్లో ఉంది.. గల్లా పట్టి హక్కులను సాధించాలి
'వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను తిరోగమనం వైపు నడిపించింది. అమరావతి, పోలవరాన్ని నాశనం చేసింది. 2019లో నెత్తిన చెయ్యి పెట్టి ఆస్తులే రాయించుకునే పరిస్థితికి తెచ్చారు. గత ప్రభుత్వంలో అనుభవించిన నరకాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి' అని సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పుడు కేంద్రంలో మన పరపతి పెరగడంతో రాష్ట్రానికి మంచి పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం హెల్తీ, వెల్తీ, హ్యాపీ (ఆరోగ్యం, సంపద, సంతోషం) సమాజమే మా లక్ష్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
'2047 విజన్ అనేది వ్యక్తి కోసం.. కులం కోసం కాదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెచ్చేందుకు ఇచ్చే హామీనే 2047 విజన్' అని సీఎం చంద్రబాబు తెలిపారు. 3 రాజధానుల పేరుతో అమరావతిపై కక్షతో వ్యవహరించారని మాజీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన కంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని చెప్పారు. ఇంత అనుభవం ఉన్నా నాకు ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రాష్ట్రాన్ని జగన్ ఐదేళ్లు పాలించారని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి పొట్టి శ్రీరాములు 125 జయంతి ప్రారంభిస్తామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.