విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ మరో అడుగు ముందుకేస్తోంది. విద్యా ప్రమాణాల్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంగ్లీషు మీడియం విద్యాబోధన, సీబీఎస్ఈ విద్యా విధానం, నాడు-నేడు ద్వారా కార్పొరేట్ స్థాయి మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టింది. ఇప్పుడు విద్యా ప్రమాణాలు పెంపుకై ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు (World Bank)ముందుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్ని అత్యుత్తమ విద్యాకేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రపంచ బ్యాంకు సహకారం అందించనుంది. విద్యా ప్రమాణాల పెంపుకై ప్రపంచబ్యాంకుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 


రాష్ట్రంలో 50 లక్షల మంది విద్యార్ధుల ప్రమాణాల పెంపుకై 250 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రత్యేక ప్రాజెక్టు రానుంది. ఈ ప్రాజెక్టుతో 45 వేలమంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు, టీచర్లు, అంగన్‌వాడీ సిబ్బందికి లబ్ది చేకూరనుంది. పేద, గిరిజన విద్యార్దులు, బాలికలకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఉంటాయి. అదే విధంగా అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందికి ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులు ఏర్పాటు చేస్తారు. డిజిటల్ వసతులు లేక నష్టపోతున్న గిరిజిన విద్యార్ధులకు టెలివిజన్, రేడియో ద్వారా ప్రత్యేక కంటెంట్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విద్యారంగంలో(Education Sector)మార్పులకు పలు కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం(Ap Government) ఇప్పుడు విద్యా ప్రమాణాల్ని కూడా పెంపొందించనుంది. 


Also read: AP Legislative Council: శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్న ఏపీ సర్కార్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook