అనంతపురం: వైసీపీ నుంచి టీడీపీలోకి వలసన పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న గురునాథ్ రెడ్డి సైకిలెక్కెందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు ఊహాగానాలు బలంగా వెలువడుతున్నాయి. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం, కుమ్ములాటలే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఏర్పాటు నుంచి గురునాథ్ రెడ్డి అనంతపురం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన తన అనుచరులతో అంతర్గ త సమావేశాలు నిర్వహించి తన నిర్ణయం తెలియజేసిన ట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైసీపీలో కొనసాగుతూ ..టీడీపీ నేతలతో సంబంధాలు


గురునాథ్ రెడ్డి వైసీపీలో కొనసాగుతున్నా.. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొందరు టీడీపీ నేతలతో ఆయన మంచి సంబంధాలు నెరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పరిటాల సునీతా, జేసీ దివాకర్ రెడ్డితో ఆయన కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా జేసీ, పరిటాల సునీతా కలిసి గురునాథ్ రెడ్డి వ్యవహారాన్ని చూస్తున్నట్లు సమాచారం.