Nimmagadda Ramesh kumar: ఏపీ పంచాయితీ ఎన్నికల్లో అధికారపార్టీకే ప్రజలు పట్టం కట్టారు. విజంయ ఊహించిందేనని అధికారపార్టీ చెబుతోంది. ఎన్నికల కమీషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇబ్బంది పెట్టినా భయపడలేదని పార్టీ స్పష్టం చేసింది. జగన్ సంక్షేమ పాలనే దీనికి కారణమంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నిక ( Ap panchayat elections 2021 )ల్లో తొలిదశ ముగిసింది. అధికారపార్టీ హవా స్పష్టంగా కన్పించింది. ఈ విజయం ఊహించిందేనని..ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr congress party )కే పట్టం కట్టారని ప్రభుత్వ సలహాదారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తొలిదశ పంచాయితీ ఎన్నికల్లో  80 శాతం స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని సజ్జల తెలిపారు. పచ్చమీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కథనాలు రాస్తున్నా..ప్రజలంతా అధికారపార్టీవేపై నిలిచారని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ప్రస్తుతం వెంటిలేటర్ పై  ఉందని..రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar )ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరూ భయపడలేదన్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, కోవిడ్ వంటి విపత్తును ఎదుర్కొన్న తీరు , ప్రజలకు కల్పించిన భరోసా ప్రజల్లో ఆదరణకు కారణమన్నారు. 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) సంక్షేమ పథకాల అమలు ద్వారానే పార్టీ ప్రజలకు మరింత చేరువైందని సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna reddy )చెప్పారు. వచ్చే 40 రోజులు ఏం చేయాలనే ప్రణాళిక  ఉందన్నారు. రాజ్యాంగవ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేయవద్దని టీడీపీకు హితవు పలికారు. వెన్నుపోటుకు పేటెంట్ తీసుకున్న చంద్రబాబు ( Chandrababu )..వైఎస్ జగన్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆఖరికి ఫలితాల్ని కూడా కొన్ని పచ్చమీడియాలు వక్రీకరించి రాస్తున్నాయని తెలిపారు. 


Also read: First phase panchayat elections 2021: తొలిదశలో అధికార పార్టీ హవా..82 శాతం వైసీపీ మద్దతుదార్లదే విజయం: మంత్రి బొత్స


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook