Pawan Kalyan: వైసీపీకి హ్యాండిచ్చిన ఎమ్మెల్సీ.. జనసేనలోకి జంప్
MLC Chennuboina Vamsikrishna Yadav: ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ వైసీపీకి షాకిచ్చారు. నేడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. విశాఖ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.
MLC Chennuboina Vamsikrishna Yadav: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జనసేన పార్టీ లక్ష్యమని.. ఉన్నతమైన దశలో రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రక్రియలో జనసేన పార్టీ కీలక భూమిక పోపిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నం చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ బుధవారం వైసీపీకి గుడ్‌బై చెప్పి.. జనసేన పార్టీలో చేరారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాగుంటుందని భావించి చాలా మంది నాయకులు ఆ పార్టీలోకి వెళ్లారని అన్నారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అర్ధం చేసుకొని మళ్లీ తిరిగి వస్తున్నారని చెప్పారు.
"ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం అవుతోంది. వంశీకృష్ణ ప్రజా రాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం విభాగం తరఫున నాతోపాటు రాజకీయ ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆయన జనసేనలోకి రావడం సొంత ఇంటిలోకి రావడం లాంటిది. యువరాజ్యంలో కీలకంగా పని చేసిన ఎందరో నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నాయకులుగా ఎదిగారు. వంశీకృష్ణ గారిని కూడా కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిగా చూడటం లేదు. ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదగాలి.
వంశీకృష్ణ గారు పార్టీలోకి వస్తున్న సమయంలో ఆయన వైసీపీ మీద ఎలాంటి ఇతర వ్యాఖ్యలు చేయకుండానే, జనసేన పార్టీ భావజాలం నచ్చడంతోనే పార్టీలోకి వస్తున్నట్లు చెప్పడం నన్ను ఆకట్టుకుంది. ఏ నమ్మకంతో జనసేనలోకి శ్రీ వంశీకృష్ణ వచ్చారో అలాంటి ప్రాధాన్యం ఆయనకు కచ్చితంగా దక్కుతుంది. ఆయనకు అండగా నిలబడతాను. జనసేన పార్టీ ఉన్నతి కోసం, ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం వంశీకృష్ణ గారు మనస్ఫూర్తిగా పనిచేస్తారని భావిస్తున్నాను. వంశీ కృష్ణ యాదవ్ గారి పార్టీ కోటాలో MLC అయిన వ్యక్తి కాదు. స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన వ్యక్తి, బలమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి రాక పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది. పార్టీలో చాలా బలమైన చేరికలు జరగనున్నాయి. అనేక మంది నాయకులు సిద్దంగా ఉన్నారు. ఇప్పుడే వంశీ కృష్ణ యాదవ్ గారితో చేరికలు మొదలయ్యాయి. భవిష్యత్తులో మరింత బలంగా జనసేన ఉండబోతుంది" అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఉత్తరాంధ్రలో, విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృష్టి చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తన శాయశక్తులా కృషిచేస్తానన్నారు. విశాఖ ప్రజలందరూ తన నిర్ణయాన్ని స్వాగతిస్తారని నమ్ముతున్నానని చెప్పారు. జనసేన పార్టీలో చేరడం తనకు పార్టీ మారినట్లుగా లేదని.. సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యువరాజ్యం విభాగంలో పనిచేశానని.. మళ్ళీ ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter