Rajya Sabha Elections: దేశంలో ఖాళీ కానున్న రాజ్యసభ సభ్యుల స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో ఖాళీ కానున్న మూడు స్థానాలకు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్‌ సీఎం రమేశ్‌ల పదవీకాలం ముగుస్తున్న విషయం తెలిసిందే. ఆ మూడు స్థానాలను వైసీపీ గెలిచే అవకాశం ఉంది. దీంతో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao Warning: మేమే వస్తాం.. అప్పుడు మీ భరతం పడతాం.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు హెచ్చరిక


మూడు రాజ్యసభ స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డిని అభ్యర్థులుగా ఆ పార్టీ అధినేత సీఎం జగన్‌ ప్రకటించారు. తమను రాజ్యసభకు అభ్యర్థులుగా ప్రకటించడంతో ఆ ముగ్గురు సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సుబ్బారెడ్డి, బాబూరావు, రఘునాథరెడ్డికి పార్టీ అధినేత శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభలో ఏపీ అంశాలపై మాట్లాడాలని సీఎం జగన్‌ సూచించారు. ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

Also Read: AP DSC Notification 2024: ఎట్టకేలకు ఏపీలో డీఎస్సీ ప్రకటన విడుదల.. పోస్టులు, దరఖాస్తుల వివరాలు ఇవిగో..


సుబ్బారెడ్డి చరిత్ర
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు సుబ్బారెడ్డి. వైఎస్‌ జగన్‌ బంధువు అవుతారు. మాజీ ఎంపీ కూడా. టీటీడీ చైర్మన్‌గా పని చేశారు.


రఘునాథరెడ్డి నేపథ్యం
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చెన్నయ్యగారి పల్లెకు చెందిన మేడా రఘునాథరెడ్డి స్థిరాస్తి వ్యాపారి. టీటీడీ బోర్డు మాఈ సభ్యుడు మేడా రామకృష్ణా రెడ్డి కుమారుడు ఈయన. రఘునాథ రెడ్డి సోదరుడు మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. రఘునాథ రెడ్డి బెంగళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి ఉన్నారు.


గొల్ల బాబూరావు నేపథ్యం
పశ్చిమగోదావరి మారేడుమిల్లి మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గొల్ల బాబూరావుకు ఎస్సీ సామాజిక కోణంలో రాజ్యసభ అవకాశం దక్కింది. ఈయన మొదటి ఏపీపీఎస్సీలో గ్రూపు అధికారిగా ఉన్నారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. 2019లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ అభ్యర్థుల మార్పుల్లో బాబూరావుకు టికెట్‌ లభించలేదు. మార్పుల్లో అత్యధికంగా ఎస్సీ స్థానాలు మారుతుందనే అభిప్రాయంతో రాజ్యసభకు బాబూరావును ఎంపిక చేయడం గమనార్హం.


వాస్తవంగా అయితే వైసీపీకి రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. మూడో అభ్యర్థిని కూడా ప్రకటించడంతో సీఎం జగన్‌ సరికొత్త వ్యూహం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాను ఆమోదించారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. మూడింటికి మూడు వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. టీడీపీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook