తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాను ‘నందమూరి తారక రామారావు’ జిల్లాగా మారుస్తామని వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన వైసీపీ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ‘ఎన్టీఆర్‌’ పేరు పెడతామని హామీ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయాన్ని గుర్తుచేసిన ఆయన గ్రామస్థుల ఫిర్యాదుపై స్పందించారు. నీరు చెట్టు పథకంలో దాదాపు 50 లక్షల రూపాయల స్కాం జరుగుతోందని ఆరోపించారు. నీరు-చెట్టు పథకం కింద చెరువును 45 అడుగుల లోతు తవ్వి.. తవ్విన మట్టిని ట్రాక్టర్‌కు 350 రూపాయలకు, లారీకి 600 రూపాయలకు అమ్ముకొని తెలుగు తమ్ముళ్లు అ‍క్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.


ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ బంధువులు కొందరు వైఎస్ జగన్‌తో మాట్లాడారు. అనంతరం ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడతామని వైఎస్ జగన్ మాటిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్వర్గీయ ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని జగన్ చెప్పారు.