Bhimili Politics: అవంతి జంపింగ్‌తో.. గుడివాడకు బంపరాఫర్!
GUDIWADA AMARNATH: వైసీపీలో ఆ మాజీమంత్రికి బంపరాఫర్ తగిలింది..! వెతకబోయినా తీగ కాలికి తగిలింది అన్నట్టు.. గతంలో తాను కోరుకున్న నియోజకవర్గంలో చేతిలో చిక్కింది. దాంతో ఆయన ఆ నియోజకవర్గమే తన అడ్డా అన్నట్టుగా రెచ్చిపోతున్నారు..! కిందిస్థాయి క్యాడర్‌ను ఏకంచేస్తూ.. వచ్చే ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు..! ఇంతకీ ఎవరా లీడర్.. ఏంటా నియోజకవర్గం..!
GUDIWADA AMARNATH: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీ లీడర్లు వరుసబెట్టి పార్టీని వీడుతున్నారు. మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అని తేడా లేకుండా నేతలంతా జగనన్న గుడ్ బై అంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసమే పార్టీ మారుతున్నామంటూ.. కూటమి పార్టీలో నేతలంతా చేరిపోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా భీమిలికి చెందిన మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడారు. ఆయనతో పాటు.. మరో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌రావు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే అవంతి శ్రీనివాస్ జంపింగ్‌తో మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు లైన్ క్లియర్ అయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది..
మాజీమంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రస్తుతం విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి గెలిచిన అమర్‌నాథ్.. జగన్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగారు. కానీ.. మొన్న జరిగిన ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గుడివాడ సిట్టింగ్ సీటు అనకాపల్లిని కాదని వైఎస్ జగన్ గాజువాకను ట్రాన్స్‌ఫర్ చేశారు. దాంతో అయిష్టంగానే నాన్ లోకల్ కోటాలో పోటీకి దిగిన గుడివాడ అమర్ నాథ్ ... పల్లా శ్రీనివాస్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక తెగ కన్ఫ్యూజన్‌కు గురవుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయనకు వెతకబోయిన తీగ కాలికి తగిలిందట. గతంలో భీమిలి నుంచి టికెట్ ఆశించినా.. అవంతి శ్రీనివాస్ రావు ఉండటంతో సాధ్యపడలేదు.. కానీ అవంతి రాజీనామాతో భీమిలీ ఇంచార్జ్‌గా గుడివాడకు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇటీవల అవంతి శ్రీనివాస్ రాజీనామాతో వైసీపీ నేతలే షాక్ అయ్యారు. గతంలో అవంతి శ్రీనివాస్ పార్టీ మారి వచ్చినా.. ఆయనకు జగన్ మంత్రి పదవిని కట్టబెట్టారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోగానే.. ఆయన మనసు కూటమి పార్టీలపై పడింది. త్వరలోనే ఆయన తెలుగుదేశం లేదా.. జనసేన పార్టీలో చేరుతారని టాక్ వినిపిస్తోంది. అయితే అవంతి శ్రీనివాస్ రాజీనామా తర్వాత రాజీనామాతో భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి ఇంచార్జ్ లేకుండా పోయారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా తర్వాత భీమిలికి కొత్త ఇంచార్జ్‌ను వైసీపీ నియమించలేదు. మరోవైపు గాజువాక నుంచి పోటీ చేసేందుకు అమర్ నాథ్ కూడా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం గాజువాకలో టీడీపీ చాలా బలంగా ఉంది. గతంలో విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ చేసినా పోరాటం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చింది. దాంతో గాజువాకలో గుడివాడ అమర్ నాథ్‌కు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అందుకే ఆయన గాజువాకలో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని సమాచారం మరోచోట నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీసీ హైకమాండ్ భీమిలి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడంతో తెగ సంతోష పడిపోతున్నారట..
ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి డ్రైవర్ లేని కారులా మారిపోయింది. అక్కడ పరిస్థితులు చేజారి పోకముందే వైసీపీ దిద్దుపాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు భీమిలి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే హైకమాండ్‌నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం అన్నట్టు గుడివాడ రేసులోకి దిగారట. తాను వెతకబోయిన తీగ కాలికి తగిలింది అని తెగ సంబుర పడిపోతున్నారట. అంతేకాదు.. భీమిలీలో వరుసబెట్టి సమావేశాలు నిర్వహిస్తూ.. క్యాడర్‌ను చేజారిపోకుండా చూసుకుంటున్నారట. ఒక విధంగా భీమిలి బాధ్యతలు స్వీకరించి తన పర్మనెంట్ అడ్డగా మలుచుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారట. వాస్తవానికి గుడివాడ అమర్ నాథ్‌కు భీమిలి కొత్తేంకాదు.. గతంలో గుడివాడ తండ్రి గుర్నాథ రావు.. పెందుర్తి నియోజకవర్గంలో పోటీచేసి గెలిచారు. అప్పట్లో పెందుర్తి నియోజకవర్గం ఇప్పుడున్నా భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ, సింహాచలం ప్రాంతాలు ఉండేవి. అటు ఈ ప్రాంతాల్లో తన సామాజికవర్గం ఓటు బ్యాంకు ఎక్కువే.. అందుకే గుడివాడ భీమిలిని ఎంచుకున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేద్దామని భావించినా.. అవంతి శ్రీనివాస్ పోటీ చేయడంతో సాధ్యపడలేదు.. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ రాజీనామాతో భీమిలిలో పాగా వేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది..
Also Read: శ్రీతేజను పరామర్శించిన డీకే అరుణ.. కీలక వ్యాఖ్యలు..
Also Read: అల్లు అర్జున్ రావాలి.. నా కొడుకు లేవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.