Ys Jagan Comments: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై, పోలీసులపై మండిపడ్డారు. టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫేక్ పోస్టులు చేస్తున్నారని..తన తల్లిని చంపేందుకు ప్రయత్నిస్తున్నానంటూ కూడా ఫేక్ న్యూస్ పోస్ట్ చేశారని ఆవేదన చెందారు. తన తల్లి ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవల్సి వచ్చిందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన తల్లిని తాను చంపేందుకు ప్రయత్నించానంటూ ఫేక్ పోస్టులు టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తుంటే అందుకు బాధ్యుడైన నారా లోకేశ్‌ను, తన భార్య వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి సంపాదకుడు రాధాకృష్ణను ఎందుకు అరెస్టు చేయరని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆఖరికి అబద్ధపు ప్రచారంపై స్పందించి తన తల్లి విజయమ్మ వివరణ ఇచ్చుకోవల్సి వచ్చిందన్నారు. తమ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్న విషయాన్ని, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తుంటే అక్రమంగా అరెస్టు చేస్తున్నప్పుడు తమపై టీడీపీ అధికారిక వెబ్‌సైట్ , ఆంధ్రజ్యోతిలో కధనాలు వచ్చినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని మండిపడ్డారు వైఎస్ జగన్. 


తన భార్య వైఎస్ భారతి కడప పోలీస్ అధికారితో ఫోన్‌లో మాట్లాడిందంటూ ఆంధ్రజ్యోతిలో ఫేక్ కధనం వచ్చినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిణామాలు జరుగుతున్నాయన్నారు. ప్రశ్నించేవారిని లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు వైఎస్ జగన్. తప్పు చేసిన పోలీసుల్ని సప్త సముద్రాలు అవతల ఉన్నా శిక్షిస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు.


Also read: Ysrcp on MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ, వైసీపీ సంచలన నిర్ణయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.