Ysrcp on MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ, వైసీపీ సంచలన నిర్ణయం

Ysrcp on MLC Elections: వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి వెల్లడించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 7, 2024, 07:24 PM IST
Ysrcp on MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ, వైసీపీ సంచలన నిర్ణయం

Ysrcp on MLC Elections: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం..ఎన్నికల్ని సజావుగా నిర్వహించే పరిస్థితి లేనందున ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. 

Add Zee News as a Preferred Source

ఏపీలో త్వరలో గుంటూరు, కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్ని బహిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించే పరిస్థితి లేదని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు తెలిపారు. కనీసం ఓట్లు అడిగే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారని, కూటమి నేతలకు పోలీసులు ప్రైవేట్ సైన్యంగా మారారని వైసీపీ నేతలు తెలిపారు. తెలుగుదేశం నేతలు ఏం చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామన్నారు. 

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. గత 5 నెలల్లో రాష్ట్రంలో 100కు పైగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పధకాలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని రాత్రికి రాత్రి అరెస్టు చేసి తీసుకెళ్తున్నారని, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కనీసం సమాచారం ఇవ్వడం లేదన్నారు. అందుకే గుంటూరు, కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించే నిర్ణయం తీసుకున్నామన్నారు. 

రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే 41 ఏ నోటీసులు అందుకున్న కేసుల్ని 307 సెక్షన్ కిందకు మార్చి అక్రమంగా జైళ్లకు పంపిస్తున్నారన్నారు. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకు ప్రైవేట్ సైన్యంగా మారిందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేసే అభ్యర్ధులకు కనీసం ఓట్లు అడిగే స్వేచ్ఛ ఉండదని అందుకే ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. 

Also read: Ys Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Trending News