YS Jagan: అదానీ వ్యవహారంలో వైఎస్ జగన్ సంచలనం.. `ఆ సంస్థ`లకు లీగల్ నోటీసులు
YS Jagan Sent Legal Notice To Top Telugu Media Houses: తనకు సంబంధం లేకపోయినా గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న మీడియాపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రెండు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు.
YS Jagan Legal Notice: లంచం వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ వ్యవహారంలో తన పేరును వినియోగిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ రెండు ప్రధాన మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు. తన హయాంలో సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించారని చెబుతూ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా పారదర్శకంగా జరిగిన నాటి ఒప్పందం పత్రాల కాపీలను కూడా నోటీసులకు జత చేశారు.
గౌతమ్ అదానీకి సంబంధించిన విద్యుత్ ఒప్పందాలను రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేసుకున్నామని మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కానీ ఆ మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే ఆ సంస్థలు అలాంటి కథనాలు ఇచ్చాయని నోటీసుల్లో జగన్ పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ప్రచురించిన ఆ కథనాలతో తన ప్రతిష్టకు దెబ్బతిందని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు.
క్షమాపణలు చెబుతూ సంబంధిత మీడియా తమ ప్రధాన పేజీల్లో వార్త ప్రచురించాలని నోటీసుల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాను పంపిన నోటీసులకు రెండు రోజుల్లో లేదంటే 48 గంటల్లో సమాధానం చెప్పాలని డెడ్‌లైన్ విధించారు. సెకితో జరిగిన ఒప్పందం చారిత్రకమని.. అలాంటి ఒప్పందాన్ని వక్రీకరించి కథనాలు ప్రచురితం చేసిన ఆ సంస్థలపై పరువు నష్టం వేస్తానని ఇటీవల జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నోటీసులు పంపడం కలకలం రేపింది. అదానీ వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒప్పందం చేసుకున్నామని ఇటీవల మీడియా సమావేశంలో జగన్ చెప్పారు. పూర్తి వివరాలు.. ఆధారాలతో చెప్పినా కూడా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీగల్ నోటీసులకు స్పందించకుంటే తదుపరి చర్యలకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter