YSR Congress Party: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకత తాను ఎప్పుడూ.. ఎక్కడా చూడలేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే చంద్రబాబు చేస్తున్న బాదుడు ఎవరూ చేసి ఉండరని తెలిపారు. ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి.. దిగజారిపోయాయి అని ఆందోళన వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy: 'మూసీ'లో కిషన్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నా సరే ప్రక్షాళన చేస్తా


వైఎస్సార్‌సీపీ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రజా ఆందోళనల కార్యాచరణపై వైఎస్‌ జగన్‌ చర్చించి పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 6 నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేక ఎప్పుడూ, ఎక్కడా చూడలేదని చెప్పారు.

Also Read: Revanth Reddy: హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసిందే! రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


'సూపర్‌ సిక్స్‌ లేదు. సూపర్‌ సెవెన్‌ లేదు. ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి.. దిగజారిపోయాయి' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైస్‌ జగన్‌ తెలిపారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2,800 కోట్లు, వసతి దీవెనకు రూ.1,100 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి. ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని చెబుతున్నారు. పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా ఉన్నాయి' అని మాజీ సీఎం జగన్‌ వెల్లడించారు.


'రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర లభించడం లేదు. చంద్రబాబు పాలనలో రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. వర్షాల ప్రభావంతో రైతులు కుదేలవుతున్నారు. ధాన్యం రంగుమారుతోంది, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు' అని పార్టీ అధినేత జగన్‌ తెలిపారు. ఇక కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు అంటూ చెప్పారు. 'ఇప్పటికే రూ.6 వేల కోట్ల వడ్డన ప్రారంభమైంది. మరో రూ.9వేల కోట్ల వడ్డన వచ్చే నెలనుంచి ప్రారంభమవుతుంది. ఈ స్థాయి బాదుడు దేశ చరిత్రలోనే ఎవరూ చేసి ఉండరు' అని పేర్కొన్నారు.


'ఎవరూ నిరసన వ్యక్తం చేయకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. రాష్ట్రం అంతటా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు' అని వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. 'అవినీతి విచ్చలవిడిగా నడుస్తోంది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే డబుల్‌ రేట్లకు ఇసుక విక్రయిస్తున్నారు. నీకింత.. నాకింత.. అని పంచుకుంటున్నారు' అని ఆరోపించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.