Revanth Reddy vs Kishan Reddy: మూసీ నది ప్రాజెక్టు అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. 'మూసీలో పడుకున్నా.. మునిగి ఆత్మహత్య చేసుకున్నా మూసీ ప్రక్షాళన మాత్రం చేసి తీరుతాం' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పడుకోవడమే కాదు ప్రధాని మోదీని తీసుకొచ్చి మూసీ నదిని చూయించాలని సవాల్ విసిరారు. మోదీ కన్నా మంచి పేరు మంచి పేరు వస్తుందనే కిషన్ రెడ్డి మా కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని విమర్శించారు.
Also Read: Harish Rao: 'నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా రేవంత్ రెడ్డి నిన్ను వదల?
అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మూసీ నది అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నువ్వు మూసీలో పడుకున్నా మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నామూసీ ప్రక్షాళన చేసి తీరుతాం' అని ప్రకటించడం కలకలం రేపింది.
Also Read: Revanth Reddy: హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసిందే! రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
'చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి మూసీ ప్రక్షాళనకు రూ.25 వేల కోట్లు నిధులు తీసుకురా. చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు తీసుకురా భూమి నేను చూపిస్తా పేదలకు మంచి అపార్ట్ మెంట్స్ కట్టిద్దాం మంచి భవిష్యత్ ఇద్దాం' అంటూ కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పేదలపై మొసలి కన్నీరు కార్చొద్దని హితవు పలికారు. 'మోదీ గుజరాత్‌కి గిఫ్ట్ సిటీ తీసుకుపోయిండు.. నువ్వు తెలంగాణకు ఏం గిఫ్ట్ తెచ్చినవ్?' అని ప్రశ్నించారు.
'రెండోసారి కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చినవ్? సమాధానం చెప్పాలి' అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. మెట్రో విస్తరణకు అవసరమైన రూ.35 వేల కోట్లలో ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని కోరారు. 'గుజరాత్ మెట్రోకు, చెన్నై మెట్రోకు నిధులు ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు ఇవ్వరు? హైదరాబాద్ తాగునీటి కోసం గోదావరి జలాల తరలించడానికి రూ.7 వేల కోట్లు కావాలి. కేంద్రం నుంచి నువ్వు ఎంత తెస్తావ్. రీజనల్ రింగ్ రోడ్డుకు, రేడియల్ రోడ్లకు రూ.50 వేల కోట్లు కావాలి. కేంద్రం నుంచి నువ్వు ఎన్ని నిధులు తెస్తావ్?' అంటూ కిషన్ రెడ్డి లక్ష్యంగా ప్రశ్నల వర్షం కురిపించారు.
రాష్ట్ర ప్రతిపాదనలు నితిన్ గడ్కరీ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని.. ఎన్ని నిధులు ఇప్పిస్తారో జవాబు చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు. మూసీలో పడుకోవడం కాదు మోదీని తీసుకొచ్చి మూసీని చూపించాలని సవాల్ విసిరారు. మూసీ అభివృద్ధి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. 'ఆరు నెలలు నేను ఊరుకుంటా కేంద్ర మంత్రిగా నువ్వు ఏం చేస్తావో చెప్పు' అంటూ కిషన్ రెడ్డిని ఏకవచనంతో విమర్శించారు. 'హైదరాబాద్ అభివృద్ధికి మోదీ నుంచి రూ.లక్షన్నర కోట్లు తెస్తే పరేడ్ గ్రౌండ్‌లో కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా' అని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.